స్కూళ్లకు 48 రోజులు వేసవి సెలవులు.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకో తెలుసా..?

TS School Summer Holidays 2023 :

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌. స్కూళ్లకు ఈ ఏడాది వేసవి సెలవులకు సంబంధించిన వివరాలను విద్యాశాఖ వెల్లడించింది. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11వ తేదీ వరకు పాఠశాలలకు ఈ ఏడాది వేసవి సెలవులు (Summer Holidays) ఉంటాయని విద్యాశాఖ పేర్కొంది. మొత్తం 48 రోజుల సెలవుల అనంతరం.. తిరిగి జూన్ 12వ తేదీన పాఠశాలలు పున: ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. ఇక.. ఈ ఏడాది సమ్మేటివ్ అసెస్‌మెంట్-2 (ఎస్ఏ) పరీక్షలు ఏప్రిల్ 12 నుంచి ప్రారంభమవుతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

అయితే.. సమ్మేటివ్ అసెస్‌మెంట్-2 పరీక్షలు ఏప్రిల్ 10 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. 10వ తరగతి పరీక్షల కారణంగా ఈ ఎగ్జామ్స్‌ను పోస్ట్‌పోన్ చేసినట్లు సమాచారం. దీంతో 1 నుండి 9వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 12 నుండి పరీక్షలు ప్రారంభమై.. ఏప్రిల్ 20వ తేదీ వరకు జరుగుతాయి. అనంతరం ఏప్రిల్ 25 నుండి వేసవి సెలవులు ప్రారంభంకానున్నాయి. ఇక.. ఎండల తీవ్రత దృష్ట్యా.. మార్చి రెండో వారం నుంచి విద్యార్ధులకు ఒంటి పూట తరగతులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *