Anchor Rashmi Gautam: బిగ్‌బాస్ షోలోకి యాంకర్ రష్మీ.. క్లారిటీ వచ్చేసింది

Anchor Rashmi Gautam Bigg Boss Season 7 Telugu: తెలుగులో బిగ్‌బాస్ షో క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే సక్సెస్ ఫుల్‌గా ఆరు సీజన్లు కంప్లీట్ చేసుకుని.. 7వ సీజన్‌కు రెడీ అవుతోంది. ఈ సీజన్‌కు కొత్త హోస్ట్ వస్తారని ప్రచారం జరుగుతుండగా.. అప్పుడు కంటెస్టంట్ల పేర్లు కూడా వైరల్ అవుతున్నాయి. బుల్లితెర స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారని తెగ ప్రచారం జరుగుతోంది. రష్మీ బిగ్‌బాస్ షోలో పాల్గొంటే చూడాలని ఆమె ఫ్యాన్స్‌ కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ప్రచారానికి తాజాగా చెక్ పెట్టింది రష్మీ. తాను బిగ్‌బాస్‌లో లేనంటూ ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. దీంతో ఆమె అభిమానులు నిరాశకు గురవుతుండగా.. రూమర్స్‌కు చెక్ పడింది.

బిగ్‌బాస్ షో ప్రతి సీజన్‌కు ముందు కంటెస్టెంట్ల సభ్యుల పేరులో రష్మీ పేరు ఉందంటూ ప్రచారం జరగడం కామన్‌గా మారిపోయింది. దీంతో ఈ సీజన్‌కు కూడా రూమర్ రాగా.. రష్మీ రంగంలోకి దిగి ముందుగానే క్లారిటీ ఇచ్చేసింది. ‘నేను బిగ్‌బాస్‌లో లేను’ అంటూ తన ఇన్‌స్టా‌ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది. బిగ్‌బాస్ షోపై ఓ ఇంటర్వ్యూలో గతంలోనే రష్మీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. 

ప్రతి సీజన్‌కు ముందు బిగ్‌బాస్ షో నిర్వాహకులు తనను సంప్రదిస్తారని చెప్పింది రష్మీ. ఆ షోకు ఉన్న పాపులారిటీ తనకు తెలుసు అని.. వేరే షోల దృష్ట్యా తాను బిగ్‌బాస్‌కు వెళ్లలేనని చెప్పేసింది. అయినా తాను ఆ షోకు సరిపోనని తేల్చేసింది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, తన పెంపుడు కుక్క (బంబుల్ బాయ్)ను విడిచి తాను దూరంగా ఉండలేనంది. తాను బిగ్‌బాస్ షో‌కు వెళితే కొత్త తలనొప్పులు వస్తాయంటూ చెప్పుకొచ్చింది. 

ఇక ఈసారి సీజన్‌కు కొత్త హోస్ట్‌ను తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి సీజన్‌కు జూనియర్ ఎన్టీఆర్, రెండో సీజన్‌కు నాని, మూడో సీజన్ నుంచి కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. రీసెంట్‌గా సీజన్‌ 6 ముగియగా.. ఈ ఏడాది 7వ సీజన్ ఆరంభంకాబోతుంది. బిగ్ బాస్ సెవెన్ హోస్ట్‌గా నాగార్జున తప్పుకున్నారని.. ఆయన స్థానంలో మరో స్టార్ హీరో హోస్ట్‌గా వ్యవహరించే అవకాశం ఉందని సమాచారం. బిగ్‌బాస్ కొత్త హోస్ట్‌గా రానా దగ్గుబాటి పేరును స్వయంగా నాగార్జున రికమెండ్ చేశారని తెలుస్తోంది. 

Also Read: Jayamangala Venkataramana: మాజీ ఎమ్మెల్యేకు సీఎం జగన్ బంపర్ ఆఫర్.. టీడీపీకి షాక్..!  

Also Read: Pm Kisan Scheme 2023: కోట్లాది మంది రైతులకు గుడ్‌న్యూస్.. హోలీకి కేంద్రప్రభుత్వం గిఫ్ట్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ –  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ –  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *