ఏపీ గవర్నర్ గా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్ ను ఛత్తీస్ ఘడ్ గవర్నర్ గా కేంద్రం నియమించింది. అలాగే దేశంలోని పలు రాష్ట్రాల గవర్నర్లను కూడా మారుస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ గవర్నర్ మార్పుపై సీఎం జగన్ స్పందించారు. గవర్నర్ గా ఆయన రాష్ట్రానికి అందించిన సేవలను సీఎం కొనియాడారు. ఛత్తీస్ ఘడ్ గవర్నర్ గా నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్ కు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం నుండి ఆయన వెళ్లిపోవడం చాలా బాధాకరంగా ఉంది. రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ ఆయనను గుర్తుంచుకుంటారని సీఎం తెలిపారు. ‘మచ్చలేని వ్యక్తిత్వం బిశ్వభూషణ్ సొంతం. కరోనా లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొని..రాష్ట్రం ప్రగతి పథంలో వెళ్ళడానికి ఆయన అందించిన సహకారం మరువలేనిది. అధికార కార్యకలాపాల నిర్వహణలో..ప్రజాస్వామ్య స్ఫూర్తి ఫరిఢవిల్లేలా..నిండైన హుందాతనంతో వ్యవహరించారని’ సీఎం జగన్ ట్వీట్ చేశారు.
అలాగే కొత్త గవర్నర్ నియామకంపై సీఎం జగన్ ట్వీట్ చేశారు. కొత్త గవర్నర్ గా నియామకం అయిన అబ్దుల్ నజీర్ గారికి అందమైన ఆంధ్రప్రదేశ్ కు రాబోతున్న సందర్బంగా హృదయపూర్వక స్వాగతం. ఏపీని మరింత ముందుకు తీసుకెళ్లడానికి మీతో కలిసి పని చేయడానికి ఎదురుచూస్తున్నానని సీఎం ట్వీట్ చేశారు.