ఏపీలో ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉన్నా రాజకీయ వేడి ఏ మాత్రం తగ్గడం లేదు. వచ్చే ఎన్నికల్లో తమ తమ భవిష్యత్తు కోసం నాయకులు ఇప్పటి నుంచే దృష్టి సారించారు. ముందు చూపుతో ఇతర పార్టీలలోకి వెళ్లేందుకు పావులు కదుపుతున్నారు. ఇక తాజాగా టీడీపీకి చెందిన కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళి వెంకటరమణ అధికార వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు వార్తలొస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి టికెట్ దక్కదనే ఆలోచనతో ఆయన ఉన్నట్లు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతుంది.
టీడీపీ మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ ప్రస్తుతం కైకలూరు టీడీపీ ఇంఛార్జ్ గా ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయనకు టీడీపీ నుంచి టికెట్ దక్కే అవకాశాలు లేవని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీనితో ఆయన టీడీపీపై కాస్త అసంతృప్తిగా ఉన్నారు. ఆయన అధికార వైసీపీ ఆయనకు టచ్ లోకి వచ్చి పార్టీలోకి ఆహ్వానించారని తెలుస్తుంది. అంతేకాదు కొన్ని రోజుల క్రితం కారుమూరితో వెంకటరమణ భేటీ కావడం పార్టీ మార్పు ప్రచారానికి మరింత ఊతం పోశాయి. ఇక వైసీపీలోకి వస్తే ఎమ్మెల్సీ ఆఫర్ ఇస్తామని సీఎం జగన్ బంపరాఫర్ కూడా ఇచ్చినట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది.
సాయంత్రం అధికారిక ప్రకటన..
ఇక సాయంత్రం పార్టీ చేరికపై వెంకటరమణ అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. కైకలూరులో ఎమ్మెల్యే రేసులో ఉన్న వెంకటరమణ ఉన్నారు. అయితే టీడీపీ-జనసేన పొత్తు కుదిరితే వెంకటరమణకు ఎమ్మెల్యే టికెట్ కష్టం. దీనితో ఆయన ప్రత్యామ్నాయ మార్గం వైపు చూశారు. ఇక ఇటీవల ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ కూడా ఇవ్వడంతో సీఎం ఆయనకు ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. దీనితో వెంకటరమణ వైసీపీలో చేరబోతున్నారని తెలుస్తుంది.