Earthquake : సిక్కింలో భూకంపం .. భూమిలో ఏదో జరుగుతోందా?

సిక్కింలోని యుక్సోమ్‌కి వాయవ్యంగా 70 కిలోమీటర్ల దూరంలో ఈ ఉదయం 4.15కి భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 4.3గా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ స్పష్టం చేసింది. ఐతే… ఇది చాలా చిన్న భూకంపం కిందే లెక్క. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4 దాకా ఉన్న భూకంపాలను చిన్నవిగా లెక్కిస్తారు. వీటి వల్ల గోడలు బీటలు వారడం వంటివి జరుగుతాయే తప్ప పెద్దగా నష్టం ఏదీ ఉండదు. కాకపోతే.. గత వారం టర్కీలో 3 భారీ భూకంపాలు రావడం వల్ల.. ఇలాంటి సమయంలో ఈ భూకంపం రావడం తీవ్ర కలకలం రేపుతోంది.

భూకంపానికి సంబంధించిన ట్వీట్ ఇక్కడ చూడండి

Assam Earthquake : నిన్న అసోంలోని నాగాన్‌లో కూడా ఇలాంటి భూకంపమే వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 4.0గా నమోదైంది. అది నిన్న సాయంత్రం 4.18కి వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) తెలిపింది.

మరో విషయం కూడా ఉంది. ఈ నెల ప్రారంభంలో మణిపూర్‌లోని ఉఖ్‌రుల్‌లో కూడా రిక్టర్ స్కేల్‌పై 4.0 తీవ్రతతో ఒక భూకంపం వచ్చింది. అంటే.. ఈశాన్య రాష్ట్రాల భూమిలోపల ఫలకాలు కదులుతున్నాయన్నమాట. అవి భారీగా కదిలితే మాత్రం ఈశాన్యంలో భారీ భూకంపం రాగలదు.

టర్కీ భూకంపం ఎఫెక్ట్.. ఇక్కడ భూమి లోపల ఉండకపోవచ్చు అంటున్న నిపుణులు.. మొత్తంగా ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రం ఓ భారీ భూకంపం ముప్పు పొంచి ఉందని అంటున్నారు. అది ఎప్పుడు వస్తుందో మాత్రం అంచనా లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *