Fire Accident : కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం.. కాలిపోయిన 3 బస్సులు

ఈమధ్య హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదాలు ఎక్కువయ్యాయి. కూకట్‌పల్లిలో.. పార్కింగ్‌లో ఉన్న మూడు బస్సులు అగ్నికి ఆహుతి అయ్యాయి. లక్కీగా బస్సుల్లో ఎవరూ లేరు కాబట్టి.. ప్రాణ నష్టం ఏదీ లేదు. కానీ ఈ బస్సులు ఎందుకు తగలబడ్డాయి? అగ్ని ప్రమాదం ఎలా సంభవించింది? ఎవరైనా కావాలని నిప్పు పెట్టారా? ఇలాంటి అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం మంటల్ని అదుపులోకి తెస్తున్నారు. కానీ బస్సులు ఇప్పటికే పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *