Couple Shares First Night Video:ఈ రోజుల్లో సోషల్ మీడియా వినియోగం మితిమీరిపోయింది. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రజలు ఆన్‌లైన్ పోర్టల్స్‌లో గంటల తరబడి గడుపుతున్నారు. సోషల్ మీడియా(Social media) పుణ్యమా అని చాలా మంది తమ టాలెంట్ చూపించి ఫేమస్ అవుతున్నారు. కొందరు మాత్రం అసభ్యకర వీడియోలు పెట్టడం,ఎక్స్ పోజింగ్ వీడియోలు పెట్టడం కూడా టాలెంట్ అనే అనుకుంటున్నారు. ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో,ఎవరిని సెలబ్రిటీలు గా మారుస్తుందో తెలియడం లేదు. చూసినవారు ఇందులో ఏముంది ఇంత వైరల్ కావడానికి అనుకున్నా కూడా కంటెంట్ లేని చాలా వీడియోలు అలా వైరల్ అవుతున్న జాబితాలోకి చేరుతున్నాయి. కొందరు లైకుల కోసం ఎలాంటి పోస్టులు పెట్టడానికైనా రెడీ అవుతున్నారు. బెడ్ రూమ్, బాత్రూమ్ అనే తేడా లేకుండా తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను వీడియో తీసి పెట్టే స్టేజీ దాటి ఇప్పుడు శోభనం వీడియోలు కూడా తీసే పరిస్థితికి వచ్చేసారు. తాజాగా ఓ జంట ఇన్ స్టాగ్రామ్(Instagram)లో పోస్ట్ చేసిన ఓ వీడియో మీద నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు. మీ పిచ్చి తగలెయ్యా..పిచ్చి పీక్స్ కి చేరిందంటూ నెటిజన్లు కామెంట్ల రూపంలో తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
అసలు వియం ఏంటంటే
పెళ్ళైన కొత్త జంట.. తమ ఫస్ట్ నైట్ ఎలా జరుపుకున్నామో అని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘శోభనం రాత్రి మేము ఎలా గడిపామో’ అనే క్యాప్షన్ తో పెళ్ళైన కొత్త జంట.. తమ ఫస్ట్ నైట్ వీడియో తీసి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో దంపతులిద్దరూ శోభనం గదిలో పెళ్లి దుస్తుల్లో ఉన్నారు. భర్త… భార్యకు ముద్దు పెట్టి,భార్య వేసుకున్న ఆభరణాలు ఒక్కొక్కటిగా తీస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆ తర్వాత భార్య జాకెట్ ముడిని కూడా భర్త విప్పుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. కెమెరా ముందు ముద్దులతో రెచ్చిపోయారు. హగ్గులతో హాటెక్కిస్తూ రొమాన్స్ చేశారు. నిద్ర మత్తులో ఉన్న నా భర్త ఇలా సాయం చేశాడు అనే కామెంట్ తో వీడియో పెట్టింది సదరు యువతి.
Photos : చిరంజీవి సినిమాలోలానే..ఫేర్ వెల్ పార్టీ ఎంజాయ్ చేసి హ్యాపీగా చనిపోయిన క్యానర్స్ పేషెంట్
అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ దంపతులపై ఫుల్ సీరియస్ అవుతున్నారు. నాలుగు గోడల మధ్య రహస్యంగా జరగాల్సింది నడిబజార్లోకి తెచ్చారంటూ సీరియస్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఏది పెట్టాలో, ఏది పెట్టకూడదో కూడా నేటి యువతకు తెలియట్లేదు అంటూ విరుచుకుపడుతున్నారు. ఇలాంటి వీడియోలు పెట్టడం వల్ల ప్రయోజనం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.