Hardik Pandya marriage: మళ్లీ పెళ్లి చేసుకోనున్న హార్దిక్ పాండ్యా! టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, అతని భార్య మోడల్ నటాషా మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా రేపు మరోసారి పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఇవాళ్టినుంచి ఫిబ్రవరి 16వ తేదీ వరకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీళ్ల వివాహం జరగనుంది. హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకలతో ఘనంగా జరుపుకోనున్నారు.
కరోనా టైంలో మే 31, 2020న వీళ్లిద్దరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ జంటకు ప్రస్తుతం ఒక బాబు కూడా ఉన్నాడు. కరోనా టైం కావడంతో కొద్దిమంది సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకున్నామని, అందుకే ఇప్పుడు బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకుంటున్నామని ఈ జంట వెల్లడించారు.
©️ VIL Media Pvt Ltd.