HYD: హైదరాబాద్ నగర శివారులో ఉన్న ఫామ్‌హౌసుల్లో వీకెండ్ సమయాల్లో గుట్టు చప్పుడు కాకుండా చట్ట విరుద్ధమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఫామ్‌హౌసులు ఎక్కువగా నగర శివార్లలో ఉండడం వల్ల పోలీసులు రైడ్ చేసే అవకాశాలు తక్కువ.. ఒకవేళ తెలిసినా ఫామ్‌హౌస్ లొకేషన్ తెలుసుకొని వెచ్చేసరికి పారిపోవచ్చనే ధైర్యంతో.. కొందరు ప్రబుద్ధులు అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అలాంటి ఫామ్‌హౌస్‌ల మీద ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కొన్ని ఫామ్‌హౌస్‌లలో చట్ట విరుద్ధమైన కార్యక్రమాలు జరుగుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం రావడంతో వెంటనే ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. మొత్తం 32 ఫామ్‌హౌస్‌లో సోదాలు కొనసాగించగా.. అందులో నాలుగింటిలో చట్ట విరుద్ధమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిగ్‌బాస్ ఫామ్‌హౌస్, జహంగీర్ డ్రీమ్ వ్యాలీ ఫామ్‌హౌస్‌తో పాటు శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రీప్లేస్ ఫామ్‌హౌస్‌లో అక్రమంగా మద్యం, హుక్కా సేవిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అదేవిధంగా మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోవర్దన్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో భారీగా డబ్బులు పెట్టి బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు బిగ్‌బాస్ ఫామ్‌హౌస్‌లో అబ్దుల్ మజీద్ (35), స్వామి (34) ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫామ్‌హౌస్ యజమాని ముతవలీ సాహెబ్ పరారీలో ఉన్నట్టు తెలిపారు.
జహంగీర్ డ్రీమ్ వ్యాలీ ఫామ్‌హౌస్‌లో షేక్ సౌఫియాన్(29), హైక్ ఇస్మాయిల్ (27) ఎండీ నవాజ్ (26), ఎండీ అఫ్రోజ్ అలీ (31), సయ్యద్ సిద్ధిక్ (28), సయ్యద్ రఫీ (27), ఎండీ ఇజాజ్ (26), ఎండీ నదీమ్ (26), ఫోజ్ ఖాన్ (27), ముస్తఫా (28)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫామ్‌హౌస్ యజమాని అజార్ పరారీలో ఉన్నాడు.
రిప్లేస్ ఫామ్‌హౌస్‌లో దాడి చేసి పోలీసులు నిఖిల్ (29), మహమ్మద్ ఇంతియాజ్ (25), రాజు (29)ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఫామ్‌హౌస్ యజమాని హేమంత్ (45) కూడా పరారీలోనే ఉన్నాడు. ఇక గోవర్దన్ రెడ్డి ఫామ్‌లో గోవద్దన్ రెడ్డి (58), పి రాజేష్ (32), మాధవరెడ్డి (55), శ్రీనివాస్ (56), రవి (46), ప్రకాష్ రావు (63), సాయిలు (46)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నాలుగు ఫామ్‌హౌస్‌ల మీద దాడులు చేసి మొత్తం 26 మందిని అరెస్టు చేశారు పోలీసులు. పట్టుబడ్డ వారి నుంచి 1,03,030 నగదు, పది సెట్లు ప్లేయింగ్ కార్డ్స్, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 10 హుక్కా పాట్‌లు, ఐదు హుక్కా పైపులు, 17 హుక్క బ్లూ బెర్రీ ఫ్లేవర్స్‌తో పాటు వివిధ బ్రాండ్లకు సంబంధించిన మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
97868172
Read More Telangana News And Telugu News