తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ శివారులోని ఫామ్ హౌజ్ లపై పోలీసులు మూకుమ్మడి దాడి చేశారు. మొత్తం 32 ఫామ్ హౌజ్ లపై దాడి చేసిన పోలీసులు 4 ఫామ్ హౌజుల్లో అసాంఘిక కార్యక్రమాలను గుర్తించారు. అసాంఘిక కార్యకలాపాలు జరుపుతున్న ఫామ్ హౌజ్ లలో మొయినాబాద్ లోని బిగ్ బాస్ ఫామ్ హౌజ్, జహంగీర్ డ్రీమ్ వ్యాలీ, శంషాబాద్ పరిధిలోని రిప్లేజ్ ఫామ్ హౌస్, మేడ్చల్ లోని గోవర్ధన్ రెడ్డి ఫామ్ హౌస్ ఉన్నటు తెలుస్తుంది. ఈ దాడిలో 26 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. వారి నుండి భారీగా నగదు, హుక్కా, మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Hyderabad: 32 ఫామ్ హౌజ్ లపై పోలీసుల మూకుమ్మడి దాడి..26 మంది అరెస్ట్
