(T. Murali Krishna, News18, Kurnool)
మెరిసిన తెలుగు తేజం మహిళా క్రికెట్ టీం కు సెలెక్ట్ అయి తన సత్తా ఏంటో నిరూపించుకుంటూ దూసుకుపోతున్న కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన తెలుగమ్మాయి అంజలి శర్వాణి.
కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన రమణ రావు అనురాధ దంపతుల కుమార్తె అంజలి శర్వాణి. తండ్రి రమణారావు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. అమ్మ అనురాధ సాధారణ గృహిణి ఈమెకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు పేరు విక్రమాదిత్య. అంజలి శర్వానికి చిన్నతనం నుంచి క్రీడలపై మక్కువ ఎక్కువగా ఉండడంతో ఏ క్రీడల్లోనైనా చురుగ్గా పాల్గొనేది. పాఠశాల స్థాయి నుంచి క్రీడల్లో పాల్గొని తన నిరూపించుకునేది. అలా అథ్లెటిక్స్ పరుగు పందెం తో పాటు లాంగ్ జంప్ ట్రిపుల్ జంప్ పోటీల్లో 40 కి పైగా పథకాలు సాధించింది అండర్ 16 జాతీయ పోటీల్లోనూ పాల్గొని తన ప్రతిభను కనబరిచింది.
అంజలి శర్వాణి యొక్క విద్యాభ్యాసం
ఆదోని పట్టణంలోని స్థానిక మిల్టన్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి వరకు చదువుకున్న అంజలి శర్వాణి పదవ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడంతో అంజలి శర్వాణి తల్లిదండ్రులు కూడా ఆమెకు ప్రోత్సాహాన్ని ఇచ్చారు. అలా క్రీడలపై ఎక్కువగా ఆసక్తి ఉండడంతో ఇంటర్లో మాత్రం ఉత్తీర్ణత సాధించలేకపోయింది. ఇంటర్లో ఒక సబ్జెక్టు ఫెయిల్ అయ్యింది. అప్పుడు మాత్రం చాలామంది ఆమెను విమర్శించారు.
అమ్మాయిలకు చదువే ముఖ్యం ఆటలాంటుతిరిగితే ఉద్యోగం వస్తుందా భవిష్యత్తు పాడవుతుంది. ఇకనైనా చదువు మీద దృష్టి పెట్టించు అని అంజలి శర్వాణి తండ్రి రమణ రావుకు చాలామంది చుట్టుపక్కల వారు చెప్పకు వచ్చారు. ఆ సమయంలో వాళ్ళ తల్లిదండ్రులు కూడా అవకాశాలు రాకపోతే తన భవిష్యత్తు ఏమవుతుందోనని కంగారుపడిన సమయంలో అంజలి శర్వాణి తల్లిదండ్రులకు ఉద్యోగం కోసం మనం వెతుక్కుంటూ వెళ్లడం కాదు ఉద్యోగమే మన కోసం వెతుక్కుంటూ వస్తుందని ఆమె తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి రైల్వేలో ఉద్యోగం సంపాదించింది.
ఇటీవలే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా బి.ఏ కూడా పూర్తి చేసింది. రోజంతా క్రికెట్ సాధన చేసే అంజలి శర్వాణి పరీక్షల సమయంలో మాత్రం విరామం తీసుకుని పరీక్షలకు సన్నద్ధం అయ్యేదట అలా తన 22 ఏళ్ల వయసులో రైల్వేస్ కు ఏం పిక్ అయింది.
క్రికెట్ వైపు అడుగులు
మొదట అంగలేశ్వర్వానికి పరుగంటే ఇష్టం. ఇంటి దగ్గర్లో ఉన్నటువంటి స్కూల్లో క్రికెట్ ఆడేది. తన ఆట తీరును చూసి వాళ్ళ కోచ్ క్రికెటర్ ని చేయమని తన తండ్రి కి సలహా ఇవ్వడంతో తొమ్మిదో తరగతిలో ప్రొఫెషనల్ క్రికెట్ ప్రారంభించింది. అలా క్రికెట్ ప్రారంభించిన ఏడాదిలోనే ఆంధ్ర జట్టుకు ఎంపికైంది. 2015 అండర్ 19 ఆంధ్ర జట్టు తన కెప్టెన్సీలో ఆల్ ఇండియా ఛాంపియన్షిప్ గెలిచింది.
ఆ తరువాత బౌలర్ గా రానించి 2016లో ఏపీ సీనియర్స్ జట్టు ఫైనల్ స్కూల్ చేరుకోవడంలో తన పాత్ర పోషించింది. కోవిడ్ తర్వాత రైల్వేస్కు ఎంపికై 17 టోపీలు గెలిచింది. గత ఏడాది సీనియర్ టి20 ట్రోఫీలో పది మ్యాచ్ల్లో 17 వికెట్లు తీసి శభాష్ అనిపించుకుంది. ఆ రెండు నెలల వ్యవధిలో 20 మ్యాచ్ల్లో 30 వికెట్లు పడగొట్టి తన ప్రతిభను కనబరిచి అందరినీ ఆకట్టుకుంది.అలా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉండడంతో అంజలి శర్వాణి క్రికెట్ వైపు అడుగులు వేసి అంచలంచలుగా ఎదిగి భారత జట్టుకు ఎంపికై తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.