META Layoffs: మెటా నుంచి మరికొంతమంది ఉద్యోగులు ఔట్ ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే 11వేలమందిని ఉద్యోగాలనుంచి తొలగించిన మెటా, మళ్లీ ఇంకొంతమందిని బయటికి పంపే పనిలో పడింది. ఈ నేపథ్యంలో ఆయా డిపార్ట్‌మెంట్‌లకు కేటాయించే బడ్జెట్‌లో జాప్యం చేస్తోంది. అయితే, దీనికి సంబంధించిన ఎటువంటి వార్తను మెటా అధికారికంగా ప్రకటించలేదు.
2023లో మెటాను అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్తానని సీఈఓ మార్క్ జుకెర్ బర్గ్ ప్రకటించాడు. దానికోసం మిడిల్ మేనేజర్లు, డైరెక్టర్లు కూడా పనిచేయాలని సూచించాడు. లేదంటే కంపెనీ వదిలిపెట్టి వెళ్లాలని హెచ్చరించాడు. మెటాలో మేనేజర్లను చూసుకోవడానికి కూడా మేనేజర్లు ఉన్నారంటూ పరోక్షంగా లేఆఫ్‌లకు సంబంధించిన సంకేతాలిచ్చాడు. ఇదివరకే ఆశించిన ఫలితాలు రాని ప్రాజెక్టులను మూసేస్తున్నట్లు మెటా ప్రకటించింది. ఈ క్రమంలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ మరొకసారి ఉంటుందని తెలుస్తోంది.
©️ VIL Media Pvt Ltd.