MLC elections: పట్టభద్రులు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ సమయంలో.. తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చారు ఆ పార్టీ సీనియర్ నేత.. ఈర్లె శ్రీరామమూర్తి. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలందిస్తున్నా.. తనను చూసి ఓర్వలేక మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఏ పదవీ రానీయడం లేదని ఈర్లె శ్రీరామమూర్తి (Earle Sriramamurthy) ఆరోపించారు. అందుకే ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గానికి టీడీపీ రెబల్‌గా బరిలోకి దిగుతున్నట్టు స్పష్టం చేశారు.
తనకు వచ్చిన రాజకీయ అవకాశాలను అయ్యన్నపాత్రుడు అడ్డుకుంటున్నాడని.. అలాంటి వ్యక్తిపై పార్టీ ఏ చర్యలూ చేపట్టడం లేదని శ్రీరామమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఆర్‌టీఐ కమిషనర్‌గా పదవులిచ్చే సమయంలోనూ అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) అడ్డు తగిలారని ఆరోపించారు. చివరకు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ విషయమై తనను చంద్రబాబు పిలిచి.. నీ అభ్యర్థిత్వాన్ని పరిశీలించామని, అచ్చెన్నాయుడిని కలవమని చెప్పినట్టు గుర్తుచేశారు.
చివరి ప్రయత్నంలో బీసీ కులానికి చెందిన మహిళకు కేటాయించారని.. అప్పుడు కూడా తాను బాధపడలేదని శ్రీరామమూర్తి చెప్పారు. కానీ తాజాగా.. ఆమెను తప్పించి తన నియోజకవర్గానికి చెందిన ఉపాధ్యాయుడికి కేటాయించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే.. తానే స్వతంత్ర అభ్యర్థిగా నిలబడేందుకు నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్న చిన్ని కుమారి లక్ష్మిని మార్చేసి.. చిరంజీవి రావును Telugu Desam Party రంగంలోకి దించింది. ఆమె ప్రచారం ముమ్మరం చేస్తున్న సమయంలో.. చంద్రబాబు ఊహించని ట్విస్ట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
Read Latest
Andhra Pradesh News
and