Myths and Facts about Infertility: ఆడవాళ్లకు 35 ఏళ్లు దాటితే.. పిల్లలు పుట్టరా..?

Myths and Facts about Infertility:  సంతానలేమిపై ఎన్నో వాస్తవాలు , అపోహలు మన సొసైటీలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. కానీ వీటిలో నిజం ఎంత, అబద్ధం ఏమిటి అని చాలామందికి తెలియదు. వీటి గురించి డాక్టర్‌ గరిమా సాహ్ని మనకు వివరించారు. 

Myths and Facts about Infertility: ప్రస్తుతం చాలా మంది దంపతులు.. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. హాస్పటళ్ల చుట్టూ తిరిగినా.. పిల్లలు కలగకపోవడంతో మానసిక వేధనకు గురవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 15 శాతం మంది సంతానలేమితో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఎయిమ్స్ నివేదిక ప్రకారం, మన దేశంలో ఇన్‌ఫెర్టిలిటీ సమస్య 10-14 శాతం ఉంది. చాలామంది పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఆడవాళ్లదే అన్నట్లు నిందిస్తూ ఉంటారు.. అయితే సంతానం కలగకపోవడానికి పురుషులలోని లోపాలు కారణం అవుతాయి. అధిక బరువు ఉంటే పిల్లలు పుట్టరని కొందరు భావిస్తారు. కానీ బరువుకు.. సంతానలేమికి సంబంధం లేదని కొన్ని అధ్యయనాలు స్పష్టం చేశాయి. ఇలా.. సంతానలేమిపై ఎన్నో అపోహలు, వాస్తవాలు మన సొసైటీలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. కానీ వీటిలో నిజం ఎంత, అబద్ధం ఏమిటి అని చాలామందికి తెలియదు. సంతానలేమిపై వాస్తవాలు, అపోహలు గురించి డాక్టర్‌ గరిమా సాహ్ని మనకు వివరించారు.(Dr. Garima Sawhney, Gynecologist and Co-Founder at Pristyn Care)

STIలు (లైంగికంగా సంక్రమించే వ్యాధులు) సంతానలేమికి కారణం అవుతాయా…

లైంగికంగా సంక్రమించే వ్యాధులకు చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే.. ఇన్ఫెర్టిలిటీకి కారణం అయ్యే.. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ (PID) వంటి పునరుత్పత్తి సమస్యలకు దారి తీస్తాయి. లైంగికంగా సంక్రమించే వ్యాధులకు సక్రమంగా చికిత్స తీసుకోకపోతే.. పురుషుల సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతాయి. వీటి కారణంగా స్మెర్మ్‌ నాణ్యత, స్పెర్మ్‌ కౌంట్‌ పడిపోవచ్చు. మేల్‌ ట్యూబ్స్‌ను (male tubes) గాయపరుస్తాయి.

సంతానలేమికి ఆడవాళ్లే కారణమా..?

పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఆడవాళ్లదే కాదు.. పురుషుల స్పెర్మ్ కౌంట్, నాణ్యత కూడా సంతానలేమి సమస్య కూడా ఓ ప్రధాన కారణం. చాలా మంది పిల్లలు కలగకపోవడానికి మహిళలదే కారణం అని నిందిస్తూ ఉంటారు. మగవారిలోని లోపాలు.. ఫిర్టిలిటీ సమస్యకు దారితీస్తాయి. వీటిని గుర్తించి, చికిత్స తీసుకుంటే పిల్లలు పుట్టే అవకాశం ఉంది.

వయస్సు కారణంగా వచ్చే ఇన్‌ఫెర్టిలిటీని.. IVFతో నయం అవుతుందా..?

జంటలకు సంతాన భాగ్యాన్ని ప్రసాదించే వైద్య విధానం ఐవీఎఫ్. అయితే వయస్సు పైబడటం వల్ల వచ్చే ఇన్‌ఫెర్టిలిటీ సమస్యను IVF తో పరిష్కరించలేం. ఈ కేస్‌లో IVF ద్వారా పిల్లలు పుట్టించడం కష్టం అవుతుంది.

ఒత్తిడి తగ్గితే.. పిల్లుల పుడతారా..

ఒత్తిడి కారణంగా.. సంతానలేమి సమస్య ఉంటే స్ట్రెస్‌ తగ్గించుకోవడం వల్ల పిల్లలు పుట్టే అవకాశం ఉంది. అయితే, ఇన్‌ఫెర్టిలిటీ కేవలం మానసిక సమస్య కాదు. ఇది పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన సమస్య. సానుకూల ఆలోచనలు, మీ ఆలోచనలో మార్పుల వల్ల శారీరక, పునరుత్పత్తి ఆరోగ్యం మెరుగుపడదు.

ఆడవాళ్లకు 35 ఏళ్ల తర్వాత పిల్లలు పుట్టరా..?

ఈ అపోహ చాలా మందిలో ఉంటుంది. అయితే, చాలా మంది మహిళలు 35 ఏళ్ల తర్వాత కూడా బిడ్డకు జన్మనిచ్చారు. ముప్పై ఏళ్లు దాటాకా పిల్లల్ని కనడం కాస్తా కష్టమైనా.. ఆరోగ్యంగా ఉంటే కనొచ్చు. చాలా మంది విషయంలో ఇది సాధ్యమైంది కూడా.

గమనిక:

ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *