ప్రస్తుతం ప్రతిరోజూ ఏదో ఒక కంపెనీ(Company) నుండి ఉద్యోగులను తొలగించే వార్తలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. పెద్ద కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇలా ఎవరి ఉద్యోగం సురక్షితంగా కనిపించడం లేదు. ఎప్పుడు ఊడుతుందో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. ఇటువంటి సమయంలో.. ఈ నివేదిక మన దేశ యువతకు ఉపశమనం కలిగించింది. దీని ప్రకారం రాబోయే కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారి ఉద్యోగాలు(Jobs) ఇబ్బందుల్లో పడవచ్చుగానీ.. మన దేశంలో ప్రతిభావంతులకు పని కొరత ఉండదు. అంటే యువతకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయని సర్వే తెలిపింది. ఇక్కడ ఉద్యోగాలలో 5 నుండి 15 శాతం వృద్ధి ఉంటుందని దాదాపు 40 శాతం CXOలు భావిస్తున్నారు. నివేదిక ఏం చెబుతుందంటే.. వ్యాపారం మరియు నియామకాల రంగంలో నిర్వహించిన సర్వేలో.. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు కోల్పోవడం ఈ సంవత్సరం అతిపెద్ద సమస్యగా ఉద్భవించవచ్చని వెల్లడైంది.
అప్పుడు సరైన వ్యక్తిని నియమించుకోవడం మరియు ఉంచుకోవడం అనే సమస్య వస్తుంది. ఇక ఈ ఏడాది నియామకాల్లో వృద్ధి ఉంటుందని 76 శాతం మంది భావిస్తున్నారు. వ్యాపార రంగంలో అనిశ్చితి కారణంగా నియామకాలపై ప్రభావం చూపుతుందని 22 శాతం సంస్థలు భావిస్తున్నాయని సర్వేలో వెల్లడైంది. నియామకం సమయంలో వినూత్న సామర్థ్యానికి కూడా ప్రాముఖ్యత ఇవ్వబడుతుందని 19 శాతం మంది వ్యాపారస్థులు విశ్వసించారు. సంస్థలు ఇప్పుడు తమ పని విధానాన్ని మార్చుకోవాలని .. రేపటి గురించి ఆలోచించే వ్యక్తులను నియమించుకోవాలని కోరుకుంటున్నాయి.
Jobs In Income Tax Department: పది, డిగ్రీ అర్హతతో.. ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగాలు..
దీని అర్థం సంస్థలు మరింత రిస్క్ తీసుకోనున్నాయి. ఆవిష్కరణల కోసం ఎక్కువ ఖర్చు చేసే పనిలో ఉన్నాయి. ఈ ఏడాది నియామకాల స్థాయి పడిపోవచ్చని సర్వేలో కేవలం పది శాతం మంది మాత్రమే చెప్పారు. యుఎస్, యూరప్ మరియు చైనాలోని ప్రజలు ఉద్యోగాల గురించి ఆందోళన చెందుతున్నప్పటికీ, సర్వేలో కేవలం 9 శాతం మంది మాత్రమే దాని గురించి ఆందోళన చెందుతున్నారని తేలినందున ఇండియా ఇంక్ భారత ఆర్థిక వ్యవస్థపై సానుకూలంగా ఉంది. ఈ సంవత్సరం ఇ-కామర్స్, ఫార్మా మరియు తయారీ రంగాలలో వృద్ధిని చూడవచ్చు. ఈ రంగాల్లో అత్యధికంగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయని సర్వే పేర్కొంది.