Pension Scheme: నెలకు రూ.9,250 పెన్షన్… చేరడానికి మార్చి 31 లాస్ట్ డేట్

కేంద్ర ప్రభుత్వం 2017లో ప్రధాన మంత్రి వయ వందన యోజన (PMVVY) పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదట్లో ఇందులో పెట్టుబడి లిమిట్ రూ.7.5 లక్షలు ఉండగా, 2018లో ఈ లిమిట్‌ను రూ.15 లక్షలకు పెంచింది కేంద్ర ప్రభుత్వం. వృద్ధాప్యంలో సీనియర్ సిటిజన్లకు సామాజిక భద్రతను ఇవ్వడానికి, వారికి వడ్డీ ద్వారా ప్రతీ నెలా కొంత ఆదాయాన్ని అందించడానికి రూపొందించిన పెన్షన్ పథకం (Pension Scheme) ఇది. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఈ పథకాన్ని నిర్వహిస్తోంది. ఈ స్కీమ్‌కు ప్రభుత్వం ఎప్పటికప్పుడు గడువు విధిస్తూ ఉంటుంది. తాజా గడువు 2023 మార్చి 31 వరకే ఉంది.

ప్రధాన మంత్రి వయ వందన యోజన పథకానికి వడ్డీని కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా నిర్ణయిస్తుంది. ప్రస్తుతం ఈ స్కీమ్‌కు 7.40 శాతం వడ్డీని అందిస్తోంది ఎల్ఐసీ . అంటే ఈ స్కీమ్‌లో చేరడం ద్వారా గరిష్టంగా నెలకు రూ.9,250 వరకు పెన్షన్ పొందొచ్చు. ఈ స్కీమ్‌లో కనీసం రూ.1,62,162 ఇన్వెస్ట్ చేయాలి. వారికి నెలకు రూ.1,000, మూడు నెలలకు రూ.3,000, ఆరు నెలలకు రూ.6,000, సంవత్సరానికి రూ.12,000 చొప్పున పెన్షన్ వస్తుంది.

IRCTC Bharat Gaurav Train: సికింద్రాబాద్ నుంచి తొలి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు… ప్యాకేజీ వివరాలివే

ప్రధాన మంత్రి వయ వందన యోజన పథకంలో గరిష్టంగా రూ.15,00,000 పొదుపు చేయొచ్చు. 7.40 శాతం చొప్పున వడ్డీ లెక్కిస్తే నెలకు రూ.9,250 పెన్షన్ లభిస్తుంది. 60 ఏళ్లు దాటిన భార్యాభర్తలు ఈ పెన్షన్ పథకంలో రూ.30,00,000 పొదుపు చేస్తే ఇద్దరికీ కలిపి రూ.18500 పెన్షన్ పొందొచ్చు. 2023 మార్చి 31 లోగా చేరేవారికే ఇంత మొత్తంలో పెన్షన్ లభిస్తుంది.

రిటైర్మెంట్ సమయంలో వచ్చిన డబ్బుల్ని దాచుకొని ప్రతీ నెలా వడ్డీ పొందాలనుకునేవారికి ఈ పథకం ఉపయోగపడుతుంది. లేదా పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చినప్పుడు వాటిని దాచుకొని ప్రతీ నెలా కొంత పెన్షన్ రూపంలో పొందాలనుకున్నా ఈ స్కీమ్‌లో చేరొచ్చు. ఇందులో చేరడానికి కనీస వయస్సు 60 ఏళ్లు. గరిష్ట వయస్సుకు ఎలాంటి పరిమితి లేదు. పాలసీ టర్మ్ 10 ఏళ్లు.

Savings Account: మహిళలు ఈ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఉచితంగా 5 లక్షల ఇన్స్యూరెన్స్

ప్రధాన మంత్రి వయ వందన యోజన పథకంలో చేరిన వారికి ప్రతీ నెల పెన్షన్ వస్తుంది. ఇలా 10 ఏళ్ల పాటు పెన్షన్ పొందొచ్చు. 10 ఏళ్ల తర్వాత మొదట చెల్లించిన మొత్తం తిరిగి వస్తుంది. ఒకవేళ పాలసీహోల్డర్ పాలసీ కొనసాగుతున్న సమయంలో మరణిస్తే నామినీకి ముందుగా జమ చేసిన మొత్తాన్ని చెల్లిస్తుంది ఎల్ఐసీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *