RRR చూసిన జేమ్స్ కామెరూన్.. మరోసారి రాజమౌళిపై ప్రశంసల జల్లు

ఇండియాతో పాటు అమెరికా, చైనా, జపాన్ వంటి దేశాల్లో RRR చిత్రం అమితంగా ప్రేక్షకాదరణ పొందిన విషయం తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు.. రామ్, భీమ్ పాత్రల మధ్య ఎమోషన్‌కు కనెక్ట్ కానటువంటి ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. అందుకే భాషతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ అన్ని వర్గాల ఆదరణను దక్కించుకుంది. ఈ క్రమంలోనే పలు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడిన RRR గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ సాధించడమే కాక ‘నాటు నాటు’ (Natu Natu) సాంగ్ ఆస్కార్ బరిలో నిలిచింది. ఇక లాస ఏంజిల్స్‌లో నిర్వహించిన ప్రీమియర్స్‌ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు జేమ్స్ కామెరాన్ (James Cameron).. రాజమౌళిని ప్రశంసించారు. అయితే అప్పుడు ఎక్కువగా మాట్లాడని కామెరూన్.. తాజాగా మరోసారి RRR చిత్రాన్ని ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు.

‘టైటానిక్, అవతార్, అవతార్ 2’ తదిర చిత్రాలతో వరల్డ్ వైడ్ ప్రేక్షకులను మెప్పించిన హాలీవుడ్ ఫిలిం మేకర్ జేమ్స్ కామెరూన్.. ఇటీవల S.S. రాజమౌళిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా జక్కన్న విజన్, జీనియస్ స్టోరీ టెల్లింగ్‌తో పాటు సినిమాలోని పాత్రలను నడిపించే భావోద్వేగాల గురించి ప్రశంసించారు. జూమ్ టీవీ డిజిటల్‌తో ప్రత్యేక ఇంటరాక్షన్‌లో.. కామెరూన్ RRR చిత్రాన్ని చూసిన తన అనుభవం గురించి పలు విషయాలు పంచుకున్నారు.

‘RRR అద్భుతమైన చిత్రం. నేను మొదటిసారి ఒక్కడినే కూర్చుని చూసినపుడు ఆశ్చర్యపోయాను. సినిమా రూపొందించిన విధానం, VFX ఉపయోగించిన తీరే కాకుండా కథ చెప్పడంలోనూ షేక్ స్పియర్ నవల మాదిరి క్లాసిజం ఉంది. చాలా సవాల్‌తో కూడుకున్న రామ్ పాత్రను మలిచిన విధానం బాగుంది. ఇది భారీ విజయంగా నేను భావిస్తున్నాను’ అని కామెరూన్ తెలిపారు. అయితే గతంలో ప్రీమియర్ సందర్భంగా RRR దర్శకుడు రాజమౌళిని వ్యక్తిగతంగా కలిసినప్పటికీ సరిగ్గా మాట్లాడలేకపోయానని చెప్పారు. ఇప్పుడు ఈ చిత్రం గురించి అతనితో మరింత మాట్లాడాలనుకుంటున్నానని చెప్పుకొచ్చారు.

హై యాక్షన్ సీన్స్, ఎంగేజింగ్ స్టోరీ టెల్లింగ్‌తో ఇప్పటి వరకు ఏ ఇతర భారతీయ చిత్రం సాధించనంత గుర్తింపును RRR ప్రపంచవ్యాప్తంగా పొందింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ యాక్షన్-అడ్వెంచర్‌ దాదాపు రూ. 1200 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ఆర్ఆర్ఆర్ చిత్రానికి సీక్వెల్ ప్లానింగ్స్‌పై నెట్టింట అనేక రూమర్స్ వినిపించాయి. అయితే మంచి పాయింట్ దొరికితే స్క్రిప్ట్ సిద్ధం చేస్తామని గతంలో రాజమౌళి వెల్లడించారు.

Read Latest

Tollywood updates and

Telugu news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *