Sun Transit 2023: శని రాశిలోకి సూర్యుడు.. ఇవాల్టి నుండి ఈ రాశుల జీవితంలో అల్లకల్లోలం..

Surya Gochar Bad Effect 2023: గ్రహాల గమనంలో పెను మార్పు ప్రజలందరిపై సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయి. ఇవాళ ఉదయం 09.57 గంటలకు  సూర్యభగవానుడు శనిదేవుడి రాశి అయిన కుంభరాశిలో సంచరించాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి కష్టాలు మెుదలుకానున్నాయి. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

సూర్య సంచారం ఈ రాశులకు ప్రతికూలం

కర్కాటక రాశి

కుంభరాశిలో సూర్యుడు సంచరించడం వల్ల కర్కాటక రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఇతరులతో వివాదాలు పెరిగే అవకాశం ఉంది. ఆఫీసులో పని ఒత్తిడి కారణంగా మీరు మానసిక ఎదుర్కోవల్సి ఉంటుంది. మెుత్తానికి మీకు కాలం కలిసిరాదు. 

సింహరాశి 

సూర్యుడి గోచారం సింహ రాశి వారి జీవితాలను కూడా ప్రభావితం చేస్తుంది. వీరికి అదృష్టం కలిసి రాదు. వ్యాపారంలో నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఫ్యూచర్ గురించి ఆందోళన మెుదలవుతుంది.  ఈ సమయంలో కోపాన్ని నియంత్రించుకోండి. అధికారులతో విభేదాలు తలెత్తుతాయి. 

కుంభం

ఒకే రాశిలో రెండు శత్రు గ్రహాలు ఉండటం వల్ల కుంభ రాశి వారికి కష్టాలు పెరుగుతాయి. డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. మీరు మానసిక ఇబ్బందులకు గురవుతారు. సూర్యుడి సంచారం కారణంగా ఈ రాశివారు అనేక సమస్యలకు గురవుతారు. ఈసమయంలో ఇతరులతో వాగ్వాదానికి దిగకుండా ఉంటే మంచిది.

మీనరాశి

మీన రాశిలోని పన్నెండవ రాశిలో సూర్యుని సంచారం జరగబోతోంది. దీంతో ఈ రాశివారు ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది.  మానసికంగా కుంగిపోతారు. దుబారా పెరుగుతుంది. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోంటారు. ఆఫీసులో పరిస్థితి మీకు అనుకూలంగా ఉంటుంది. 

Also Read: Kumbha Sankranti 2023: ఇవాళే కుంభ సంక్రాంతి… ఈ రాశులను వరించనున్న అదృష్టం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link – https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link – https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *