Tamilisai: ‘నల్లగా ఉన్నావని.. నుదురు బట్ట తలలా ఉందని ట్రోల్ చేస్తున్నారు’

Tamilisai Soundararajan: తన శరీర ఛాయపై కొందరు పదే పదే విమర్శలు చేస్తున్నారని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆవేదన వ్యక్తం చేసారు. తాను నల్లగా ఉన్నానని విమర్శలు చేస్తున్న ప్రత్యర్థులను అగ్గిలా మారి వణికిస్తానని హెచ్చరించారు. శనివారం చెన్నై తండయార్‌పేటలోని ఓ బాలికల పాఠశాలలో జరిగిన వార్షికోత్సవం కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విద్యార్థినులకు బహుమతులు ప్రధానం చేసిన అనంతరం గవర్నర్ మాట్లాడారు.

“నేను నల్లగా ఉన్నానంటూ కొందరు అదే పనిగా ట్రోల్ చేస్తున్నారు. నా నుదురు బట్టతలలాగా ఉంటుందని హేళన చేస్తున్నారు. అలాంటి వారిని హెచ్చరిస్తున్న నల్లగా ఉన్నావని అంటే.. అగ్గిలా మారతా. నన్ను ట్రోల్ చేసే వారు ఉహించనంత ఉన్నత స్థాయికి వెళతా.” అని గవర్నర్ వ్యాఖ్యనించారు.

విమర్శలను తాను పట్టించుకోనన్న గవర్నర్.. కష్టపడి పని చేయటమే తనకు తెలుసునని అన్నారు. తనను విమర్శించే వారు ఓర్వలేనంత ఉన్నత స్థాయికి చేరుకుంటానని చెప్పారు.

Read More Telangana News And Telugu News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *