Teeth whitening : పళ్ళు తెల్లగా కనిపించాలనుకుంటున్నారా.. ఇలా చేయండి..

Teeth whitening : పళ్ళు ముత్యాల్లా తెల్లగా ఉండాలని చాలా మంది అనుకుంటారు. ఇందుకోసం స్పెషల్ టూత్‌పేస్ట్, ట్రీట్‌మెంట్ తీసుకుంటారు. కానీ, హైడ్రోజెన్ పెరాక్సైడ్‌తో ఇంట్లోనే పళ్ళన తెల్లగా మార్చొచ్చు. ఎలానో చూడండి..

అందమైన చిరునవ్వు.. మనల్ని ఇంకా అందంగా కనిపించేలా చేస్తుంది. అందుకోసం పళ్ళు తెల్లగా కనిపించాలని చాలా మంది అనుకుంటారు. పళ్ళు తెల్లగా కనిపించాలని చాలా మంది వైటనింగ్ స్ట్రిప్స్, డెంటిస్ట్‌ని కలిసి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, కొన్ని చిట్కాలతో ఇంట్లోనే అందమైన, తెల్లని పళ్ళని సొంతం చేసుకోవచ్చు. అది కూడా హైడ్రోజన్ పెరాక్సైడ్‌‌‌తో. మరి దీనిని వాడి ఎలా చేయొచ్చో ఇప్పుడు చూద్దాం.

హైడ్రోజన్ పెరాక్సైడ్..

ఇది మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. పెద్దగా ఖర్చుకూడా ఉండదు. దంతాలను తెల్లగా మార్చడంలో బాగా పనిచేస్తుంది. చాలా మంది దీనిని అనేక రకాలుగా వాడతారు కూడా. యాంటీ మైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉన్న ఈ హైడ్రోజన్ ప పెరాక్సైడ్ నోటి సంబంధ సమస్యల్ని దూరం చేస్తుంది. బ్యాక్టీరియా, నోటి దుర్వాసన వంటి సమస్యలు చాలా వరకూ తగ్గిపోతాయి.

పుక్కిలించడం..

కావాల్సిన పదార్థాలు..

3శాతం ఉన్న హైడ్రోజన్ పెరాక్సైడ్ 1 టేబుల్ స్పూన్

నీరు 1 టేబుల్ స్పూన్

ఏం చేయాలంటే..

దంతాలను తెల్లగా చేసేందుకు ముందుగా హైడ్రోజన్ పెరాక్సైడ్ 3శాతం ఉన్న లిక్విడ్‌ని 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. దీనికి సమాన పరిమాణంలో నీరు తీసుకోండి. రెండింటిని కలిపి నోటిలో 2, 3 నిమిషాలు అటు ఇటు తిప్పుతూ శుభ్రం చేసుకోండి. దీనిని వారానికి 2 లేదా 3 సార్లు చేయొచ్చు.

Also Read : Planks : ఈ వర్కౌట్ సరిగ్గా చేస్తే బెల్లీ, బరువు.. రెండూ తగ్గుతాయట..

నిమ్మరసం..

కావాల్సిన పదార్థాలు..

బేకింగ్ సోడా 1 టీ స్పూన్

నిమ్మరం రెండు, మూడు చుక్కలు

హైడ్రోజన్ పెరాక్సైడ్ 1 టీ స్పూన్

ఏం చేయాలంటే..

ఇందుకోసం బేకింగ్ సోడా 1 టీ స్పూన్, రెండు, మూడు చుక్కల నిమ్మరసం, హైడ్రోజన్ పెరాక్సైడ్ 1 టీస్పూన్ తీసుకుని మూడింటిని బాగా కలిపి దంతాలపై పేస్ట్‌లా పూయండి. ఒకటి లేదా రెండు నిమిషాల పాటు అలానే ఉంచి నోటిని నీటితో బాగా కడగండి.

Also Read : Cucumbers : దోసకాయలు ఇలా తీసుకుంటే బరువు తగ్గుతారు

బేకింగ్ సోడాతో..

కావాల్సిన పదార్థాలు..

బేకింగ్ సోడా టీ స్పూన్

3 శాతం హైడ్రోజన్ పెరాక్సైడ్ టీ స్పూన్

ఏం చేయాలంటే..

ఇప్పుడు బేకింగ్ సోడా టీ స్పూన్ పరిమాణంలో తీసుకోండి. 3 శాతం హైడ్రోజెన్ పెరాక్సైడ్ ఓ ఐదారు చుక్కలు వేసి మెత్తటి టూత్‌పేస్ట్‌లా వేసి దీంతో పళ్లు తోమండి. దీనిని కూడా వారానికి 2 సార్లు చేయొచ్చు.

ఇయర్ బడ్‌తో..

కావాల్సిన పదార్థాలు..

ఇయర్ బడ్..

హైడ్రోజన్ పెరాక్సైడ్‌ 2 చుక్కలు

ఏం చేయాలంటే..

హైడ్రోజన్ పెరాక్సైడ్‌ని రెండు చుక్కలు తీసుకుని ఇయర్ బడ్ అందులో అద్ది పళ్ళపై రుద్దండి. ఓ రెండు నిమిషాలకి మించి అలా ఉండొద్దు. తర్వాత నోటిని నీటితో క్లీన్ చేసుకోండి. దీనిని కూడా వారానికి 2 నుంచి 3 సార్లు చేయొచ్చు.

ఉప్పుతో..

కావాల్సిన పదార్థాలు..

ఉప్పు ఓ స్పూన్

హైడ్రోజన్ పెరాక్సైడ్ 1 స్పూన్

ఏం చేయాలంటే..

ఉప్పు, హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో క్లీన్ చేసేందుకు ముందుగా 1 స్పూన్ హైడ్రోజన్ పెరాక్సైడ్, అంతే పరిమాణంలో ఉప్పు తీసుకోవాలి. రెండింటిని బాగా కలిపి టూత్ బ్రష్‌పై పెట్టి.. పళ్ళని బాగా తోమండి. ఆ తర్వాత క్లీన్ చేయండి.

ఏం చేయాలంటే..

దీనిని వాడే ముందుగా మీ డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. ఎంత పరిమాణంలో తీసుకోవాలనేది తెలుసుకుని వాడడం మంచిది. ఎక్కువగా తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని మరిచిపోవద్దు.

Also Read : Rectal cancer Causes : ఎక్కువగా కూర్చుంటే ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందట..

వాడే ముందు..

హైడ్రోజన్ పెరాక్సైడ్ ఎక్కువగా వాడితే చిగుళ్ళు బలహీనమయ్యే ప్రమాదముంది. కాబట్టి, కొద్దిగానే వాడాలి. అదే విధంగా పైన చెప్పిన చిట్కాలన్నీ కూడా ఒకేసారి చేయొద్దు. ఒక్కోటిగా చేయాలి. రెగ్యులర్‌గా అసలే వద్దు. దీంతో పాటు.. హైడ్రోజన్ పెరాక్సైడ్.. అనేక సమస్యలకి కారణమవుతుంది. కాబట్టి, వాడే ముందు డాక్టర్‌ని సంప్రదించాకే వాడడం మంచిదని గుర్తుపెట్టుకోండి.

గమనిక:

ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *