తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాటల పంచ్ లు పేలాయి. మొదట కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై నిప్పులు చెరిగిన కేసీఆర్ ఆ తరువాత బండి సంజయ్, రేవంత్ రెడ్డి టార్గెట్ గా సీఎం కేసీఆర్ తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఇక ఆ తరువాత రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల అంశంపై మాట్లాడుతున్న సమయంలో కేసీఆర్ అసెంబ్లిలో మొదటిసారి బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పేరును ప్రస్తావించారు. ఇక ఆతరువాత కేసీఆర్ తన ప్రసంగంలో ఈటెల పేరును పదే పదే చెప్పుకొచ్చారు. మొత్తం తన ప్రసంగంలో 12 సార్లు ఈటెల పేరును కేసీఆర్ ప్రస్తావించడం గమనార్హం.
తెలంగాణ లాంటి ప్రభుత్వం దేశంలో అధికారంలోకి వస్తే వస్తే దేశం బాగుపడుతుంది. వడ్లు కొనమని మంత్రులు వెళ్లి అడిగితే నూకలు తినమంటారా? ఇంత అహంకారమా అని మండిపడ్డారు. ఇటీవల బీజీపీలోకి చేరిన ఈటెలకు అన్నీ తెలుసు. ఇక్కడి నుంచి అక్కడికి పోతే అన్నీ మర్చిపోతారా? ఇక ఇటీవల సందు దొరికినప్పుడల్లా తమపై రాజేందరన్న నిందలు వేస్తున్నారని కేసీఆర్ అన్నారు. ఈ సమయంలో అసెంబ్లీలో నవ్వులు పూశాయి.
Cm Kcr: బండి సంజయ్ , రేవంత్ రెడ్డికి సీఎం కేసీఆర్ వార్నింగ్..కూలుస్తుంటే చూస్తూ ఊరుకుంటామా..
ఈటెల రాజేందర్ రియాక్షన్..
ఇక కేసీఆర్ తన పేరును పదే పదే ప్రస్తావించడంపై ఈటెల రాజేందర్ రియాక్ట్ అయ్యారు. ఈటెల చరిత్ర తెలిసిన వాళ్లు..నా గురించి తక్కువ ఆలోచన చేయరు. వైఎస్ హయాంలో కూడా ఇలాగే ప్రచారం చేశారు. నేను అడిగిన వాటికి సమాధానం చెప్పినంత మాత్రాన నేను పొంగిపోను. ఈరోజు కేసీఆర్ నాపేరు చెప్పారని పొంగిపోను. నాపై చేసిన దాడిని నేను మర్చిపోను. బీఆర్ఎస్ లో సైనికుడిగా పని చేశాను. బీజీపీలో కూడా అలాగే పని చేస్తాను. నేను పార్టీ మారలేదు. వాళ్లే నన్ను గెంటేశారని అన్నారు. గెంటేసిన వాళ్లు పిలిచినా కూడా పోనన్నారు. అసెంబ్లీలో నన్ను కేసీఆర్ డ్యామేజ్ చేశారు. అబద్దాన్ని అటు ఇటు తిప్పి చెప్పగల నాయకుడు సీఎం కేసీఆర్. ఇక తనకు చేసిన డ్యామేజ్ ను సరిచేసుకోడానికి ఎన్ని నెలలు పడుతుందో అని రాజేందర్ అన్నారు.
ఇక అసెంబ్లీలో ఈటెల రాజేందర్ అడిగిన ఓ డిమాండ్ ను సీఎం కేసీఆర్ నెరవేర్చారు. డైట్ ఛార్జీలు పెంచాలని ఈటెల అసెంబ్లీలో డిమాండ్ ను లేవనెత్తగా..కేసీఆర్ దానిపై సానుకూలంగా స్పందించారు. అది న్యాయసమ్మతమైన డిమాండ్. ఇక్కడే ఉన్న మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రరెడ్డిలను ఆదేశిస్తున్నా. డైట్ ఛార్జీల పెంపుపై రెండు మూడు రోజుల్లో జీవో విడుదల చేయాలనీ ఆదేశించారు. అంతేకాదు ఈ విషయంలో ఈటెలకు సమాచారం ఇవ్వండి. అవసరమైతే రమ్మని చెప్పి సలహాలు, సూచనలు తీసుకోండని కేసీఆర్ అన్నారు. ఈటెల అడిగాడని చేయకుండా ఊరుకోవద్దని, తమ ప్రభుత్వం బేషజాలు లేకుండా మంచి సలహాలు ఇస్తే తప్పకుండా తీసుకుంటామని కేసీఆర్ అన్నారు.