Woman With Dead Bodies: తల్లి, భర్త మృతదేహాలతోనే నాలుగు రోజులు.. హృదయ విదారకం

కళ్లెదుటే కన్నతల్లి, భర్త అచేతనంగా పడి ఉన్నా ఏమీ చేయాలని నిస్సహాయత ఆమెది. పేదరికం ఎలాంటిదో కళ్లకు కట్టి కన్నీరు పెట్టిస్తున్న ఘటన ఇది. మనిషి పుట్టుక నుంచి చావు వరకు ‘రూపాయ్‌’ విలువ ఎలాంటిదో తమిళనాడు(Tamilnadu)లో జరిగిన ఓ హృదయ విదారక ఘటన చూస్తే అర్థమవుతుంది. తల్లి, భర్త మృతదేహాలతోనే నాలుగు రోజులు పాటు కాలం వెళ్లదీయాల్సి వస్తే అది ఎంత నరకంగా ఉంటుందో.. అంతకు మించి ఎంత బాధగా ఉంటుందో ఊహించుకుంటానే ఒళ్లు గగుర్పొడుస్తుంది.

ఇంటి నుంచి దుర్వాసన :

గోబిచెట్టిపాళయం(Gobichettipalayam)కు చెందిన 60 ఏళ్ల వృద్ధురాలు తన భర్త, తల్లి మృతదేహాలను దహనం చేయడానికి డబ్బుల్లేక నాలుగు రోజుల పాటు అక్కడే ఉంచడం స్థానికంగా కలకలం రేపింది. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఈ వృద్ధురాల స్థితి చూసి షాక్‌కు గురయ్యారు. అప్పటికే మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి. మృతులను కుమలన్ వీధికి చెందిన మోహనసుందరం (74), అత్త కనకాంబల్ (80)గా గుర్తించారు. వారిని గోబిచెట్టిపాళయం జీజీహెచ్‌కు తరలించారు.

పేదరికం వల్లే ఈ దుస్థితి:

మోహనసుందరం, అతని భార్య శాంతి తమ 35 ఏళ్ల కుమారుడు, శాంతి తల్లి కనకాంబాల్ ఓకే ఇంట్లో నివసిస్తున్నారు. వాళ్ల కుమారుడి మానసిక దివ్యాంగుడు. కొన్ని నెలల క్రితం మోహనసుందరం అనారోగ్యంతో మంచాన పడ్డాడు. అదే సమయంలో కనకాంబాల్ కూడా అస్వస్థతకు గురైంది. ఇంట్లో ఎవరూ పనికి వెళ్లలేక పేదరికంలో కూరుకుపోయారు. ఇదే వాళ్ల పాలిట శాపంగా మారింది. తినడానికి తిండి లేక.. తాగడానికి కొన్నిసార్లు నీరు కూడా లేని దుస్థితి తలెత్తింది. పూట గడవడమే కష్టంగా మారింది. అదే సమయంలో మోహనసుందరం, కనకాంబాల్‌ ఆరోగ్య పరిస్థితి మరింత క్షిణించింది. అలా రోజులు గడిచాయి.. ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఇద్దరు చనిపోయారు. ఆ సమయంలో శాంతికి ఏం చేయాలో తోచలేదు.. దహన సంస్కారాలకు డబ్బులేదు. దీంతో ఏం చేయాలో అర్థం అవ్వక తన కుమారుడితో ఇంట్లోనే ఉండిపోయింది. డెడ్‌ బాడీల నుంచి దుర్వాసన వస్తున్నా.. అక్కడే ఉండిపోయింది. అయితే ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు గోబిచెట్టిపాళయం పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వాలంటీర్ల సాయంతో మృతదేహాలకు దహన సంస్కారాలు నిర్వహిస్తామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *