వైసీపీ సమీక్షా సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్న ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమం తరహాలోనే మా భవిష్యత్ నువ్వే జగన్ ప్రోగ్రాం చేపట్టాలని దిశానిర్ధేశం చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ చేపట్టిన కార్యక్రమాల్లో అసలు తిరగని, తక్కువ తిరిగిన ఎమ్మెల్యేలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక్క రోజు కూడా కార్యక్రమం చేపట్టని ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలుస్తోంది. పలువురు ఎమ్మెల్యే 34 రోజులకే ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీనిపై ఎమ్మెల్యేలు, రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో మా భవిష్యత్తు నువ్వే జగన్ క్యాంపెయినింగ్ ప్రోగ్రాంపై ప్రజెంటేషన్ ఇచ్చారు. చేసిన లబ్దిని ప్రతి గడపకూ చేరవేయడమే కార్యక్రమం ప్రధాన అజెండా అని పార్టీ నేతలకు స్పష్టం చేశారు. గడపగడపకూ మన ప్రభుత్వంపై కూడా ఏపీ సీఎం సమీక్ష చేపట్టారు. ఏపీలోని అనేక జిల్లాల్లో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో.. మార్చి 18 నుంచి మా భవిష్యత్తు నువ్వే జగన్ కార్యక్రమాన్ని చేపట్టాలని వైసీపీ నాయకత్వం పార్టీ నేతలకు సూచించింది.
YS Jagan: ఇలాగైతే ఎలా.. పలువురు ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్న సీఎం జగన్..
