Adani Enterprises Q3 Results: దిగ్గజ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్.. ప్రస్తుతం సంక్షోభంలో ఉన్న సంగతి తెలిసిందే. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణల నేపథ్యంలో.. అదానీ కంపెనీల షేర్ల ధరలు భారీగా పడిపోతున్నాయి. అయితే ఈ సమయంలోనూ అదానీ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీ మాత్రం అదరగొట్టింది. 2022-23 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాలు చూస్తే మీరు కూడా ఇలా అనాల్సిందే. ఏకీకృత ప్రాతిపదికన ఈ అదానీ కంపెనీ నికర లాభం ఏకంగా రూ.820 కోట్లుగా నమోదైంది. అక్టోబర్- నవంబర్ పనితీరు ఇలా ఉందన్నమాట. ఇక గతేడాది ఇదే సమయంలో నష్టాల్లో ఉండటం గమనార్హం. అప్పుడు రూ.11.63 కోట్ల మేర నష్టపోయింది.
ఇక కంపెనీ ఆదాయం కూడా భారీగా పెరిగింది. ఆపరేషన్స్ వచ్చే రెవెన్యూ 42 శాతం ఎగబాకి.. రూ.26,612.2 కోట్లకు చేరింది. గతేడాది ఇదే సమయంలో ఇది రూ.18,757.9 కోట్లుగా మాత్రమే ఉంది. బ్లూమ్‌బర్గ్ అంచనాలను మించి అదానీ కంపెనీ లాభాలను నమోదు చేయడం విశేషం. ఇటీవల అదానీ పవర్, అదానీ పోర్ట్స్ వంటి ఇతర అదానీ గ్రూప్ కంపెనీలు మాత్రం మూడో త్రైమాసిక ఫలితాల్లో కాస్త నిరాశపరిచాయి.
97908645
97898538
97881284
Read Latest
Business News and Telugu News