ఇండియా 5జీ సేవలు (5G Services) దశల వారీగా విస్తరిస్తున్నాయి. ప్రధాన నగరాలను దాటి చిన్న చిన్న నగరాలకు చేరుతున్నాయి. ఈ సమయంలో 5జీ ఫోన్ (5G Phones)లకు డిమాండ్ పెరిగింది. ఈ అవకాశాన్ని మార్కెట్ చేసుకునేందుకు ఇండియన్ మొబైల్ కంపెనీ లావా బడ్జెట్ రేంజ్‌లో ఓ లేటెస్ట్ మోడల్‌ను లాంచ్ చేసింది. గతేడాది నవంబర్‌లో ఈ కంపెనీ కొన్ని ఆసక్తికరమైన ఫీచర్లతో లావా బ్లేజ్ 5Gని ఇంట్రడ్యూస్ చేసింది. రూ.10000లోపు ధరతో, 4GB RAM, 128GB స్టోరేజీ ఆప్షన్స్‌తో లావా బ్లేజ్ 5G సింగిల్ వేరియంట్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు కంపెనీ ఈ లైనప్‌ను విస్తరించింది.
6GB RAM, 128GB స్టోరేజ్ ఆప్షన్‌తో కొత్త వేరియంట్‌ను లాంచ్ చేసింది. Lava Blaze 5G లేటెస్ట్ వేరియంట్, దాని ఒరిజినల్ మోడల్ మధ్య చాలా అంశాలు కామన్‌గా ఉన్నాయి. లావా బ్లేజ్ 5G కొత్త మోడల్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఎలా ఉన్నయో ఇప్పుడు పరిశీలిద్దాం.
* లావా బ్లేజ్ 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
లావా బ్లేజ్ 5G గరిష్టంగా 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల HD+ IPS డిస్‌ప్లేను అందిస్తుంది. ఇది వాటర్ డ్రాప్ నాచ్‌తో సొగసైన ఫ్లాట్-ఎడ్జ్ డిజైన్‌తో రూపొందింది. లావా బ్లేజ్ 5G స్మార్ట్‌ఫోన్ క్లాక్ స్పీడ్ 2.2 GHz, LPDDR4X మెమరీ, UFS 2.2 స్టోరేజ్ ఉన్న MediaTek డైమెన్సిటీ 700 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. అంతే కాకుండా ఈ ఫోన్ మెమొరీ కార్డ్ స్లాట్‌ను కూడా అందిస్తోంది.
ఇది కూడా చదవండి : ఊరించే ఆఫర్లు.. టాప్ బ్రాండ్స్ స్మార్ట్‌ఫోన్‌లపై 40% వరకు డిస్కౌంట్!
ఇది మెమరీని 1TB వరకు ఎక్స్‌పాండ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ డివైజ్‌లో 5000mAh బ్యాటరీ ఉంటుంది. ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌తో పనిచేసే లావా స్మార్ట్‌ఫోన్ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది. ఇది అనానమస్ కాల్(Anonymous Call)ను రికార్డ్ చేసే ఫీచర్‌తో వస్తుంది. అదనపు సౌలభ్యం, భద్రత కోసం, డివైజ్ లాక్ చేయడానికి, అన్‌లాక్ చేయడానికి సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.
* కెమెరాల పనితీరు
లావా బ్లేజ్ 5G స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందిస్తుంది. ఇందులో EIS సపోర్ట్, 2K వీడియో రికార్డింగ్ సామర్థ్యాలతో 50MP ప్రైమరీ కెమెరా సెన్సార్ పొందుపరిచారు. సెల్ఫీల కోసం , వీడియో కాల్స్ కోసం స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ ఫ్లాష్‌తో 8MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
* Lava Blaze 5G ధర, లభ్యత
లావా బ్లేజ్ 5G కొత్త వేరియంట్ 6GB RAM, 128GB స్టోరేజ్ ధర రూ.11999గా ఉంది. అయితే లాంచింగ్ సందర్భంగా కంపెనీ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.11499కి అందిస్తోంది. ఈ బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్‌ను ఆన్‌లైన్‌లో కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్(Amazon)లో కొనుగోలు చేయవచ్చు.