అమెరికాలో కాల్పులు..ముగ్గురు మృతి అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఈస్ట్ లాన్సింగ్‌లోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలో ఓ దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పల్లో ముగ్గురు మృతి చెందగా..పలువురికి గాయాలయ్యాయి. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 8.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది.
మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలోకి చొరబడ్డ అగంతకుడు కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన స్టూడెంట్స్ , విద్యార్థులు, సిబ్బంది వెంటనే తరగతి గదుల్లోకి పారిపోయారు. కాల్పుల తర్వాత నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించారని..మరో పది మంది వరకు గాయపడ్డారని వర్సిటీ సిబ్బంది తెలిపారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు..నిందితుడి కోసం గాలిస్తున్నారు.
©️ VIL Media Pvt Ltd.