‘గుప్పెడంత మనసు’ ఫిబ్రవరి 14 ఎపిసోడ్: లవర్స్‌డే రోజున ఏడు అడుగులేసిన రిషిధార..రిషికి పుష్ప హెల్ప్!

Guppedantha Manasu 2023 february 14 Episode: బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్.. 2023 ఫిబ్రవరి 14న 681 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. Guppedantha Manasu february 14 Episode హైలైట్స్ చూద్దాం. (photo courtesy by star మా and disney+ hotstar)

Guppedantha Manasu 2023 february 14 Episode: గత ఎపిసోడ్‌లో రిషి.. వసు ఇంటికి వెళ్తే వసు చాలా టెక్కు చేస్తుంది. రిషితో మాట్లాడకుండా.. చక్రపాణిని అడ్డం పెట్టుకుని.. సమాధానాలు ఇస్తుంది. ఇక రిషి కూడా అంతే.. వసులానే చక్రపాణితో మాట్లాడతాడు. దాంతో చక్రపాణి అటు సమాధానం చెప్పలేక.. ఇటు సమాధానపరచలేక.. నలిగిపోతాడు. మరోవైపు మహేంద్ర.. జగతీకి గడువు ఇస్తాడు. ‘వసుధార విషయంలో రిషికి నిజం తెలియక బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను.. తనకు ఏది ఏమైనా రెండే రెండు రోజుల్లో నిజం తెలియాలి. లేదంటే నేనే డైరెక్ట్‌గా రిషికి నిజం చెప్పేస్తాను జగతీ’ అంటూ వార్నింగ్ కూడా ఇచ్చేస్తాడు. మరోవైపు రిషి, వసులు.. ఒకరి గురించి ఒకరు టామ్ అండ్ జెర్రీలా మాటలు అనుకుంటూనే ఉంటారు. రిషి.. వసుకి.. ‘తలనొప్పి తగ్గిందా?’ అని మెసేజ్ చేస్తే.. ‘మీరు వెళ్లిపోయారు కదా’ అని పొగరుగా మెసేజ్ చేస్తుంది వసు. దాంతో రిషి.. ‘అంటే నేనే తలనొప్పా? తనని నేనేం బాధపెట్టాను?’ అనుకుంటూ ఆలోచిస్తాడు. అదే సీన్ నేటి కథనంలో కంటిన్యూ అయ్యింది. ఇప్పుడు ఆ హైలైట్స్ చూద్దాం. (రిషి.. వసు ఇంటికి వెళ్లిన రోజు రాత్రే ఈ కథనం నడుస్తుంది.)

వసుధారకి కాల్ చేద్దామా..

ఇక వసు.. ‘రిషి సార్‌కి కోపం వచ్చిందా?’ అనుకుంటూ రిషికి కాల్ ట్రై చేస్తుంది. సరిగ్గా అదే సమయానికి.. ‘వసుధారకి కాల్ చేద్దామా’ అనుకుంటూ రిషి కాల్ ట్రై చేస్తాడు. దాంతో ఇద్దరికీ బీజీ అని వస్తుంది. ‘బిజీనా ఎవరితో మాట్లాడుతుంది’ అనుకుంటూ రిషి స్విచ్ ఆఫ్ చేస్తాడు. ‘రిషి సార్ ఫోన్ బిజీ వస్తుంది ఏంటీ? ఎవరితో మాట్లాడుతున్నారు?’ అనుకుంటూ మళ్లీ ట్రై చేసేసరికి.. రిషి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది వసుకి. ఇక రిషి మనసులో.. ‘మెడలో తాళిని చూస్తూ కూడా మన మధ్య ఈ బంధమేంటో కదా? ఇంకా ఎంతకాలం ఇలా? ఈ గుండె గది ఖాళీ చేసి వెళ్లిపో వసుధారా.. ప్లీజ్.. మనం కలిసి జీవించలేకపోయినా కలిసి పని చేస్తాం కదా? అది బాధైనా బాగుంటుందేమో వసుధారా?’ అనుకుంటాడు.

మరి నీ ఫ్రెండ్..

‘మీ బాధ ఎంతోకాలం ఉండదు.. మీకు ఎంత క్లూ ఇస్తున్నా.. నా మీద కోపంతో అసలు నిజం తెలుసుకోలేకపోతున్నారు. త్వరలోనే దీనికి నేనే ముగింపుని ఇస్తాను’ అనుకుంటుంది వసు. ఇక సీన్ కట్ చేస్తే.. కాలేజ్‌కి పుష్ప స్టడీ సర్టిఫికెట్ కోసం వస్తుంది. వెళ్తూ వెళ్తూ రిషి క్యాబిన్‌కి వెళ్లి రిషిని పలకరిస్తుంది. ‘హేయ్ పుష్పా.. ఏంటి ఇలా వచ్చావ్?’ అంటాడు రిషి లోపలి రమ్మంటూ. ‘స్టడీ సర్టిఫికెట్ కోసం వచ్చాను సార్’ అంటుంది పుష్ప. ‘అవునా జాబ్ ఎలా ఉంది?’ అంటాడు రిషి. ‘బాగుంది సార్’ అంటుంది పుష్ప. ‘మరి నీ ఫ్రెండ్(వసుధార) ఎలా ఉంది. ఈ మధ్యలో కలిశావా?’ అంటాడు రిషి. ‘బాగానే ఉంది సార్.. కానీ ఈ మధ్యలో కలవడం వీలు కాలేదు’ అంటుంది పుష్ప.

చెప్పి వెళ్తారా?

‘మరి వాళ్ల ఆయన్ని చూశావా?’ అంటాడు రిషి. ‘ఏంటో సార్ ఎప్పుడు అడిగినా తన భర్తని చూపించదు. తను బిజీ మేము బిజీ.. అందుకే మేము ఒకటి డిసైడ్ అయ్యాం సార్’ అంటుంది పుష్ప. ‘ఏంటది?’ అంటాడు రిషి. ‘మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఆదివారం వసుధార ఇంటికి వెళ్దామని డిసైడ్ అయ్యాం..’ అంటుంది పుష్ఫ. ‘చెప్పి వెళ్తారా?’ అంటాడు రిషి. ‘చెప్పకుండా ఎలా వెళ్తాం సార్? చిన్న పార్టీగా ప్లాన్ చేద్దాం అని ఐడియా ఉంది’ అంటుంది పుష్ప. ‘గుడ్ ఐడియా.. కానీ చెప్పకుండా వెళ్లి సర్ఫైజ్ చేయొచ్చుగా? వాళ్ల ఆయన్ని చూడొచ్చు’ అంటాడు రిషి.

అదే రోజు చెప్పకుండా..

‘ఆలోచిస్తాను సార్’ అంటుంది పుష్ఫ. ‘హా పుష్పా.. ఇప్పుడు మీరు వాళ్ల ఇంటికి వెళ్లేకన్నా.. మీ ఇంటికి వసుధారని, వాళ్ల ఆయన్ని భోజనానికి రమ్మనొచ్చుగా?’ అంటూ సలహా ఇస్తాడు రిషి. మనసులో ‘అదే రోజు చెప్పకుండా నేను వెళ్తాను పుష్పా వాళ్ల ఇంటికి’ అనుకుంటాడు మిస్టర్ ఇగో. ‘సార్ ఆల్ రెడీ అడిగాను సార్.. తర్వాత ఎప్పుడైనా చూద్దాం అంది సార్’ అంటుంది పుష్ఫ. ‘తెలివైంది కదా.. అలానే మాట దాటేస్తుందిలే..’ అని మనసులో అనుకున్న రిషి.. ‘మరి ఈ పెళ్లి వీడియోలు.. ఫొటోలు.. అవి అడగకపోయావా?’ అంటాడు. ‘అడిగాను సార్.. సమాధానం దాటేసింది.. సార్ నేను వెళ్లనా?’ అంటుంది పుష్ఫ. ‘సరే వెళ్లు.. ఇది పుష్పా.. వాళ్ల నాన్నగారి నంబర్ నీ దగ్గరుందా?’ అంటాడు రిషి.

నాకే పరీక్షలు పెడతావా?

‘ఉంది సార్’ అంటుంది పుష్ప. ‘నాకు పంపించవా’ అంటాడు రిషి. పుష్పా.. చక్రపాణి నంబర్ పంపించి.. వెళ్లిపోతుంది. వెంటనే రిషి.. చక్రాపాణి నంబర్‌కి కాల్ చేస్తాడు. రింగ్ అవ్వడంతో.. ‘ఇప్పుడు తెలుస్తుంది వసుధార ఎవరిని పెళ్లి చేసుకుందో.. ఎంతకాలం దాచిపెడతావ్ వసుధారా.. నాకే పరీక్షలు పెడతావా?’ అనుకుంటాడు మనసులో. ఇక చక్రపాణి ఫోన్ రింగ్ అవ్వడం చూసిన వసు..

నాన్నా మీకు ఫోన్

అనుకుంటూ నంబర్ చూసేస్తుంది. ‘అమ్మా రిషి సార్ మీరేనా? నాన్నకి ఫోన్ చేసి నా పెళ్లి విషయం తెలుసుకోవాలి అనుకుంటున్నారా..?’ లిఫ్ట్ చేసి.. కాస్త గొంతు గంభీరంగా మార్చి.. ‘ఎవరండి.. మాట్లాడేది’ అంటుంది వసు.

హలో ఎవరండి..

వసు మాట వినగానే.. వెంటనే కట్ చేసిన రిషి.. ‘ఇదేంటి వసుధారే కదా? ఇంకా కాలేజ్‌కి బయలుదేరలేదా? ఛా.. రాంగ్ టైమ్‌లో చేశానా?’ అనుకుంటూ ఉంటాడు. ఇంతలో వసునే చక్రపాణి నంబర్ నుంచి రిషికి కాల్ చేస్తుంది. రిషి వెంటనే కట్ చేస్తాడు. మళ్లీ చేస్తుంది.

ఇప్పుడు

ఎలా?

అనుకుంటూ ఉంటాడు. చేసేది లేక లిఫ్ట్ చేసి.. ‘హలో ఎవరండి’అంటాడు రిషి ఏం తెలియనట్లుగా. ‘హలో మీకు ఎవరు కావాలండీ.. ఈ నంబర్‌కి కాల్ చేశారు కదండి’ అంటుంది వసు కాస్త బొంగురు గొంతుతో ‘వసుధారే కదూ?’ అంటాడు రిషి. ‘అవును.. ఎవరు మీరు?’ అంటుంది వసు. ‘నేనే వసుధారా’ అంటాడు రిషి. ‘నేను అంటే?’ అంటుంది వసు కావాలని. ‘రిషీని..’ అంటాడు రిషి.

నువ్వు కాలేజ్‌కి..

‘హో ఎమ్‌డీగారా..’ అంటుంది వసు కావాలనే. ‘మై డార్లింగ్(ఎమ్‌డీ)’ అనే సీన్ గుర్తొచ్చిన రిషి.. ‘నేను ఎమ్‌డీని కాదు’ అంటాడు. ‘కాదా.. అదేంటి సార్? కాలేజ్ ఎమ్..డీ మీరే కదా?’ అంటుంది వసు. ‘కాలేజ్ ఎమ్‌డీని నేనే’ అంటాడు రిషి. ‘ఏంటి సార్.. మా నాన్నకి చేశారు కాల్’ అంటుంది వసు కొంటెగా. ‘అదా.. అది.. నువ్వు కాలేజ్‌కి బయలుదేరావో లేదో అని కాల్ చేశానంతే’ అంటాడు రిషి. ‘అప్పుడు నాకు కదా కాల్ చెయ్యాల్సింది ఎమ్.. డీ.. గా…రు’ అంటుంది వసు మెలికలు తిరుగుతూ. ‘ఆ.. అది.. మరి..’ అంటూ నసుగుతున్న రిషితో.. వసు.. ‘నా ఫోన్ కనెక్ట్ కాలేదు అంటారు అంతేనా’ అంటుంది.

హమ్మయ్యా..

‘హా.. అవును అవును.. నీ ఫోన్ కలవలేదు’ అంటాడు రిషి. నవ్వుకుంటుంది వసు. ‘కానీ మీరు మా నాన్న నంబర్ బాగానే సంపాదించారు ఎమ్‌డీ గారు..’ అంటుంది వసు. ‘నువ్వు ఇలా మాటిమాటికి ఎమ్‌డీ అనకు’ అంటాడు రిషి. ‘ఎందుకు ఎమ్‌డీ గారు’అంటుంది వసు. వెంటనే రిషి.. ‘హలో.. హలో.. వసుధారా.. ఇక్కడ సిగ్నల్స్ లేవు.. ఓకే ఓకే బై’ అనేసి ఫోన్ కట్ చేస్తాడు. ‘హమ్మయ్యా..’ అనుకుంటూ ‘ఒక్క దానికోసం వివరాలు తెలుసుకోవడం ఇంత కష్టమా.. రాజీవ్ తాళి కట్టలేదు. కానీ పెళ్లి అయ్యింది.. మరి తాళి ఎవరు కట్టారు.? ఇంత తక్కువ సమయంలో పెళ్లి ఎలా కుదిరినట్లు..? ఏదో లింక్ మిస్ అవుతున్నా’ అని ఆలోచిస్తాడు రిషి.

ఫాలో అయిన వసు..

ఇంతలో కాలేజ్ బాయ్ వచ్చి.. ‘సార్ ఏమైనా తీసుకుని రమ్మంటారా?’ అంటే.. ‘హా ఒక తాళి తీసుకునిరా’ అంటాడు రిషి. ‘సార్’ అంటాడు ఆ వ్యక్తి ఆశ్చర్యంగా చూస్తూ. ‘హా.. అది.. ఒక

టీ

తీసుకునిరా’ అంటాడు రిషి. ఇక కాసేపటికి వసు కాలేజ్‌కి వస్తుంది. అప్పటికి రిషి జేబులో చేతులు పెట్టుకుని.. బాధగా.. మూడ్ ఆఫ్‌లో అలా నడుచుకుంటూ వెళ్లడం చూసిన వసు..

రిషి సార్ రిషీ సార్

అంటూ అరుస్తుంది. కానీ.. రిషి పట్టించుకోడు. రిషికి వినిపించదు. ‘ఇదేంటి రిషి సార్ మూడ్ ఆఫ్‌లో ఉన్నప్పుడే జేబులో చేతులు పెట్టుకుంటారు’ అనుకుంటూ వెనుకే నడుస్తుంది. రిషి పాపం ఓ చోటికి వెళ్లి.. కూర్చుని.. ఒక చేతిని గడ్డం కింద పెట్టుకుని బాధగా కూర్చుంటాడు. వెంటనే వసు.. నెమ్మదిగా వెళ్లి.. పక్కనే రిషి ఎలా కూర్చున్నాడో అలానే కూర్చుని మౌనంగా ఉంటుంది.

నీతో ఇదే సమస్య వసుధారా..

రిషి కాసేసటికి అనుకోకుండా.. పక్కనే తనలానే కూర్చున్న వసుని చూసి.. తేరుకుని.. ‘నువ్వు ఎప్పుడొచ్చావ్’? అంటాడు. ‘నేను ఎప్పుడు మీ వెనుకే ఉంటాను కదా సార్’ అంటుంది వసు నవ్వుతూ. ‘నా వెనుక కాదు.. నా పక్కనే ఉండాల్సినదావి’ అనుకుంటాడు రిషి మనసులో. ‘వెనుక ఉన్నవాళ్లు పక్కకు కూడా వస్తారు సార్.. పక్కకు వచ్చినవారు ముందుకు కూడా వస్తారు కదా సార్’ అంటుంది వసు కూల్‌గా. ‘మ్యాథ్స్‌లో లాజిక్స్ ఉంటాయి కానీ.. జీవితంలో ప్రతిదానికి లాజిక్స్ ఉండవు వసుధారా’ అంటాడు రిషి. ‘సార్ కొంచెం విశాల హృదయంతో ఆలోచించండి’ అంటుంది వసు. ‘నీతో ఇదే సమస్య వసుధారా.. చెప్పాల్సినవన్నీ దాచేస్తావ్.. దాచాల్సినవన్నీ చెప్పేస్తావ్’ అంటాడు రిషి కోపంగా.

సరే నువ్వు వెళ్లు..

‘నిజం తెలుసుకోండి సార్’ అంటుంది వసు కూల్‌గా. ‘చెప్పడం ఈజీనే వసుధారా.. ఆ తపన.. ఆ బాధే చాలా కష్టంగా ఉంటుంది’ అంటాడు రిషి. ‘బాధ గురించి నాకు చెప్పకండి సార్.. ఎక్కువ నేనే బాధపడుతున్నాను..’ అంటుంది వసు. ‘అయినా నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావ్.. వెళ్లి పని చూసుకోపో..’ అంటాడు రిషి. ఇంతలో ఒక లెక్చరర్ వచ్చి.. ‘సార్ నాకు తలనొప్పిగా ఉంది.. టాబ్లెట్ వేసుకుని ఓ గంట రెస్ట్ తీసుకుంటాను’ అంటుంది. సరే అంటాడు రిషి. ఆమె వెళ్లిపోతుంది. ఆమె వెళ్లగానే.. వసుతో.. ‘నీ తలనొప్పి తగ్గిందా?’ అంటాడు. ‘ఎవరి తలనొప్పో వింటే మీకు నా తలనొప్పి గుర్తొచ్చిందా?’ అంటూ అలిగినట్లు చూస్తుంది వసు. ‘సరే నువ్వు వెళ్లు..’ అంటాడు రిషి. ‘మీరు వస్తేనే నేను వెళ్తాను.. మీటింగ్ మీతోనే నాకు.. ప్రాజెక్ట్ గురించి చెప్పాలి కదా?’ అంటుంది.

ఫ్యాన్స్ మెచ్చే సీన్..

‘నేను వస్తానులే వెళ్లు.. అంతా మనల్నే చూస్తున్నారు’ అంటాడు రిషి. ‘లేదు.. ఎవరు ఏం అనుకున్నా ఫర్లేదు. నేను ఏడు అంకెలు లెక్కబెట్టేలోపు మీరు నాతో రావాలి’ అంటుంది వసు. ‘అదేంటి ఎవరైనా మూడు అంకెలు.. పది అంకెలు అంటారు.. నువ్వేంటి ఏడు అంటున్నావ్’ అంటాడు రిషి. అది అంతే సార్.. అన్న వసు.. మనసులో మాత్రం.. ‘మీరు నాతో కలిసి ఏడు అడుగులు వెయ్యాలిగా’ అనుకుంటుంది. పైకి లేచి.. లెక్కపెట్టడం మొదలుపెడుతుంది వసు. 1, 2, 3, 4, 5, 6.. అంటూ సరిగ్గా ఏడు లెక్కపెట్టగానే.. రిషి పైకి లేచి.. నవడం మొదలుపెడతాడు. వసు మురిసిపోతూ రిషి అడుగులో అడుగులు వేసుకుంటూ నడుస్తుంది. ఏడు అడుగులు రిషితో కలిసి వేసేస్తుంది. ఆ సీన్‌కి ఓ మ్యూజిక్, ఎమోషన్ జోడించడంతో.. ఆ సీన్ ఫ్యాన్స్‌కి నచ్చేలా ఆసక్తికరంగా ఉంది.

జగతి సైగలు..

ఇక జగతీ, మహేంద్రలు మాట్లాడుకుంటూ ఉంటారు. ‘జగతీ ఆల్ రెడీ ఒకరోజు అయిపోయింది. ఇంకొక్క రోజే చూస్తాను నేను.. లేదంటే రిషికి నిజం చెప్పేస్తాను’ అంటాడు. ‘అది కాదు మహేంద్రా.. వసు దీని గురించి ఏం అనుకుంటుందో తననే డైరెక్ట్‌గా అడుగుతాను’ అంటుంది జగతి. ఇంతలో రిషి తలుపుకొట్టి లోపలికి వస్తాడు. రావడం రావడమే ‘మేడమ్’ అని ఏదో మాట్లాడబోతాడు. వెంటనే జగతీ కావాలని మహేంద్రవైపు తిరిగి.. ‘మహేంద్రా నువ్వు వస్తావా రావా? ఎందుకు రాను అంటున్నావ్’ అంటూ గొడవకు దిగుతున్నట్లుగా కావాలనే అంటుంది. ‘ఇదేంటి ఇప్పటి దాకా బాగానే ఉంది కదా.. ఎందుకు ఇలా మాట మార్చేసింది? ఎక్కడికీ రావాలనీ?’ అని మనసులో అంటూ బిక్కముఖం వేస్తాడు మహేంద్ర. సైగ చేస్తుంది జగతీ. ‘నేను రాను.. రానంటే రాను జగతీ’అంటాడు మహేంద్ర వెంటనే.

బిత్తరపోయిన మహేంద్ర..

‘ఎక్కడికి డాడ్’ అంటాడు రిషి. మహేంద్రకు కూడా ఎక్కడికో తెలియకపోవడంతో బిత్తరచూపులు చూస్తూ.. ‘హా.. అది.. అది.. జగతీ రమ్మన్న చోటికీ’అని తప్పించుకుంటాడు. ‘మహేంద్రా ఏంటీ నువ్వు.. రావచ్చు కదా’ అంటుంది జగతీ మరోసారి. వెంటనే రిషి.. ‘మేడమ్ మిమ్మల్ని నేను తీసుకుని వెళ్తాను పదండి’ అంటాడు. వెంటనే జగతీ చాలా సంతోషంగా.. సంబరంగా నవ్వుతుంది. మరి జగతీ ఎక్కడికి వెళ్లాలనుకుంటుందో? రిషి తీసుకుని వెళ్తాను అనగానే ఎందుకు సంతోషిస్తుందో తెలియాల్సి ఉంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! Guppedantha Manasu కొనసాగుతోంది. (photo courtesy by star maa and disney+ hotstar)

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *