జాబ్ నోటిఫికేషన్ల కోసం చూసే లింక్డ్‌ఇన్‌లోనూ Layoffs.. ఇదీ అసలు పరిస్థితి!

Linkedin Fires Employees: మైక్రోసాఫ్ట్‌కు చెందిన లింక్డ్‌ఇన్ తాజాగా ఉద్యోగుల్ని తీసేసింది. రిక్రూటింగ్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగులపై ఈ లేఆఫ్స్ (Linkedin Layoffs) ప్రభావం పడింది. ఈ మేరకు ది ఇన్ఫర్మేషన్ న్యూస్ వెబ్‌సైట్ నివేదించింది. లింక్డ్‌ఇన్ అనేది.. మైక్రోసాఫ్ట్‌లోని బిజినెస్, ఎంప్లాయ్‌మెంట్ ఫోకస్డ్ సామాజిక మాధ్యమం. ఇది సోమవారం ఉద్యోగుల్ని తీసేసిందని రిపోర్ట్‌లో తెలిసింది. అయితే ఎంత మంది ఉద్యోగుల్ని తీసేశారు అనే దానిపై స్పష్టత లేదు. మైక్రోసాఫ్ట్ ఇటీవల లేఆఫ్స్‌లో భాగంగా ఉద్యోగుల్ని చాలా మందిని తీసేసిన సంగతి తెలిసిందే. మైక్రోసాఫ్ట్ తన హార్డ్‌వేర్ డివిజన్స్ హోలోలెన్స్ (Hololens Layoffs), సర్ఫేస్ (Surface), Xbox టీమ్స్‌లో ఉద్యోగాల కోత చేపట్టింది. బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ ప్రకారం.. ఈ టెక్ కంపెనీ ఒక్క సీటెల్ ఆఫీసులోనే 617 మంది ఉద్యోగుల్ని తొలగించింది.

మైక్రోసాఫ్ట్‌కే చెందిన సాఫ్ట్‌వేర్ కొలాబరేషన్ ప్లాట్‌ఫాం గిట్‌హబ్ (GitHub) ఇటీవల తన వర్క్‌ఫోర్స్‌లో 10 శాతం ఉద్యోగుల్ని తీసేసింది. అలాగే శాన్‌ఫ్రాన్సిస్కోలోని ప్రధాన కార్యాలయం సహా ఇతర ఆఫీసులన్నింటినీ మూసేసింది. ఈ కంపెనీలో మొత్తం పనిచేసే ఉద్యోగుల సంఖ్య 3000. ఇక ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో.. కొత్త ఉద్యోగ నియామకాలను కూడా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

ఇక మైక్రోసాఫ్ట్ జనవరిలో 10 వేల మంది ఉద్యోగులు లేదా తన మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 5 శాతం మందిని తీసేస్తున్నట్లు వెల్లడించింది. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో.. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా ఇలా చేస్తున్నట్లు పేర్కొంది. ఇదే సమయంలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక మాంద్యం సవాళ్లు విసురుతుందని, అందుకే తీసేస్తున్నట్లు ఒక పోస్ట్ పెట్టారు. ఇక గతేడాది జులైలోనూ మైక్రోసాఫ్ట్.. కొంత మొత్తంలో ఉద్యోగుల్ని ఇంటికి పంపించింది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌కే చెందిన వివిధ విభాగాలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. ఇక 2023లో మొత్తంగా 344 టెక్ కంపెనీలు.. 1,03,767 మంది ఉద్యోగుల్ని తీసేసినట్లు Layoffs.fyi ట్రాకింగ్‌లో వెల్లడైంది.

97901854

97898538

97898211

Read Latest

Business News and Telugu News

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *