నా దగ్గర లేవా డబ్బులు..? చెప్పు తీసుకొని కొడతా: అనసూయ వార్నింగ్

‘వాలంటైన్స్ డే’ కావడంతో యాంకర్ అనసూయ భరద్వాజ్ తన భర్తతో కలిసి తీసుకున్న ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. “నీతో లైఫ్ చాలా క్రేజీ” అంటూ ఈ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది. అంతవరకు అంతా బాగానే ఉంది. అయితే ఆ ఫొటోకు ఓ నెటిజన్ కొంచెం హద్దు మీరి “అలా ఏం లేదు అక్కా.. వాడి దగ్గర చాలా డబ్బు ఉంది అందుకే” అని కామెంట్ చేశాడు. ఇంకేముంది అసలే వాలంటైన్స్ డే.. అందులోనూ తన హబ్బీని అలా అనేసరికి అనసూయకు కోపం వచ్చింది. కానీ కంట్రోల్ చేసుకొని వెటకారంగా దానికి ఇలా రిప్లై ఇచ్చింది.

చెప్పుతో కొడతా

“అదేంట్రా తమ్ముడూ.. అలా అనేశావు. ఎంతుందేంటి డబ్బు? నాకు లేదా మనీ మరి?. చెప్పు.. నీకన్నీ తెలుసు కదా.. అయినా ఆయన డబ్బు, నా డబ్బు అనేది కూడా ఉందా? రేయ్ చెప్పరా బాబూ.. అయినా బావ గారిని వాడు, వీడు అనొచ్చా? ఇదేం పెంపకంరా నీది.. చెంపలేసుకో.. లేకపోతే నేను వేస్తా చెప్పులతోటి.. సారీ నా అర్థం చెప్పులతో చెంపలేస్తానని. “

– అనసూయ

అయితే అనసూయ ఇచ్చిన ఈ రిప్లైకి మళ్లీ ఆ నెటిజన్ అగ్రెసివ్‌గా రియాక్ట్ అవుతూ “మీరు రియాలిటీని అర్థం చేసుకోవాలి. మీరు ఎంత చెప్పినా రియాలిటీ రియాలిటీనే అంటూ” వరుస కామెంట్లు చేశాడు. దీనికి కాసేపున్నాక అను.. మళ్లీ రిప్లై ఇచ్చింది.

నీ బొందరా

“నీ బొందరా నీ బొంద.. మాట్లాడటం నేర్చుకో ఫస్ట్. అంతర్యామిలా అన్నీ తెలిసినట్లు బిల్డప్ ఒకటి. నా రియాలిటీ నీకేం తెలుసురా.. పచ్చ కామెర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందంట. నీ బుద్ధి మనీ ఒకటే అయితే.. అందరిదీ అదే అనిపిస్తుంది. వీలైతే మారు.. గెట్ వెల్ సూన్.. తమ్ముడివి కదా.. మంచి, చెడు చెప్తున్నా.. ఏమనుకోకయ్యా”

– అనసూయ

దీంతో మొదలైంది అసలు రగడ. “నీ నుంచి మంచి నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదంటూ.. కావంటే నువ్వు నీ రెజ్యూమ్ నాకు పంపు.. నిన్ను పనిమనిషిగా పెట్టుకుంటా” అంటూ ఆ నెటిజన్ కామెంట్ చేశాడు.

97908983

దొబ్బెయ్ ఇక్కడి నుంచి

ఈ కామెంట్‌కు అను బాగా హర్ట్ అయింది. “నా ఇన్‌స్టాలో నేను ఫొటో పెట్టుకుంటే నీకెందుకురా.. అయినా అంత నచ్చకపోతే నన్ను ఫాలో అవడం ఎందుకు. ఇక్కడి నుంచి దొబ్బెయ్” అంటూ వార్నింగ్ ఇచ్చింది.తర్వాత కూడా ఆ నెటిజన్ కామెంట్ చేస్తూనే ఉన్నాడు. “ఇక విసుగొచ్చిందో లేక ఎందుకులే వీడితో అనుకుందో..” అనసూయ ఇక శాంతించింది. అయితే అనసూయ ఫ్యాన్స్ ఆ నెటిజన్‌ను తగులుకున్నారు. వరుసగా రిప్లై ఇస్తూనే ఉన్నారు.

Read latest TV News and Movie Updates

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *