నెట్ ఫ్లిక్స్ సంస్థపై వెంకటేష్ ఫైర్

నెట్ ఫ్లిక్స్ సంస్థపై వెంకటేష్ ఫైర్ టాలీవుడ్ సీనియర్ స్టార్స్‌‌లో ముందుగా ఓటీటీలో తన సినిమాను రిలీజ్ చేసిన హీరో వెంకటేష్. ఆయన హీరోగా నటించిన ‘నారప్ప’ చిత్రం ఓటీటీలోనే విడుదలైంది. ముందుగా వెబ్‌‌ సిరీస్‌‌ చేస్తున్న సీనియర్ హీరో కూడా ఆయనే. నెట్‌‌ ఫ్లిక్స్‌‌ నిర్మిస్తున్న ‘రానా నాయుడు’ వెబ్‌‌ సిరీస్‌‌లో ఆయన నటిస్తున్నారు. ఇందులో రానా మరో హీరో. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయింది. ఎప్పుడు స్ట్రీమ్ అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు .

ఇదిలా ఉంటే నెట్ ఫ్లిక్స్ సంస్థపై ఫైర్ అయ్యారు వెంకటేష్. ‘పెద్ద తప్పులు చేయకూడదు నెట్‌‌ ఫ్లిక్స్.. ఇందులో హీరో ఎవరు.. నేను, స్టార్ ఎవరు.. నేను, ప్రేక్షకులు చూసేది నన్ను, ఫ్యాన్స్‌‌ కూడా నా వాళ్లే, కనుక షోకు కూడా నా పేరే పెట్టాలి.. నాగా నాయుడు’ అని ఓటీటీ సంస్థకు స్వీట్ వార్నింగ్‌‌ ఇచ్చారు వెంకటేష్. ప్రమోషన్స్‌‌లో భాగంగా ఈ సెల్ఫీ వీడియోను ట్వీట్ చేశారు వెంకటేష్. ఇందుకు అంతే ధీటుగా ఆన్సర్ ఇచ్చాడు రానా. ‘ట్రైలర్‌‌‌‌ లాంచ్‌‌కు వచ్చేయ్.. గేట్ దగ్గర ఎంట్రీ లభించకపోతే రానా నాయుడికి తండ్రిని అని చెప్పు’ అంటూ మరో వీడియో ట్వీట్ చేస్తూ..  త్వరలోనే ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ట్రైలర్‌‌‌‌ లాంచ్ ఉండబోతున్నట్టు హింట్ ఇచ్చాడు. పాపులర్ అమెరికన్ సిరీస్ ‘రే డోనోవర్’కు ఇది ఇండియన్ అడాప్షన్ వెర్షన్. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమ్ కానుంది.

©️ VIL Media Pvt Ltd.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *