బ్యాడ్‌న్యూస్.. ఎస్‌బీఐ బాదుడే బాదుడు.. ఏకంగా 100 శాతం పెరిగిన ఛార్జీలు!

SBI Card Hikes Processing Fee: ఎస్‌బీఐ కార్డ్‌కు చెందిన క్రెడిట్ కార్డు (SBI Credit Card) వాడుతున్నారా? అయితే మీకో బ్యాడ్‌న్యూస్. క్రెడిట్ కార్డు ద్వారా చేసే రెంట్ పేమెంట్స్ ప్రాసెసింగ్ ఛార్జీలను (SBI Rent Payments Processing Charges) భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. గతంలో ఈ రెంట్ పేమెంట్ ఛార్జీ ట్యాక్స్‌కు అదనంగా రూ.99గా ఉండేది. ఇప్పుడు దానిని ఏకంగా రూ.199కి పెంచేసింది. మళ్లీ ట్యాక్సులు అదనంగా కట్టాల్సిందే. అంటే దాదాపు 100 శాతం కంటే ఎక్కువే పెరిగింది. ప్రాసెసింగ్ ఫీజును రెట్టింపు చేసిందన్నమాట. ఈ మేరకు SBI Card.. తన కస్టమర్లకు మెయిల్స్, SMS లు పంపింది. పెంచిన ఛార్జీలు 2023, మార్చి 17 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

SBI Cards ఎస్‌ఎంఎస్ ప్రకారం.. ”2023, మార్చి 17 నుంచి SBI Credit Card తో చేసే రెంట్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్‌ ఛార్జీలు మారతాయి.” అని ఉంది. ఇదే SBI Card గతంలో అంటే 2022, నవంబర్‌లో కూడా క్రెడిట్ కార్డుతో చేసే రెంట్ పేమెంట్స్ ప్రాసెసింగ్ ఛార్జీల్ని పెంచింది. అప్పుడు 18 శాతానికి GST కి అదనంగా రూ.99గా నిర్ణయించింది. ఇప్పుడు దానిని ఏకంగా రూ.199కి చేర్చింది.

97911694

97908645

SBI Cards రెంట్ పేమెంట్స్ ఛార్జీలను సవరించిన నేపథ్యంలో.. ఇతర బ్యాంకుల్లో ఇవే ఛార్జీలు ఏ విధంగా ఉన్నాయో ఓసారి చూద్దాం.

క్రెడిట్ కార్డుల ద్వారా చేసే రెంట్ పేమెంట్స్‌‌పై తాము ఒక శాతం ప్రాసెసింగ్ ఫీజుగా వసూలుచేస్తామని ప్రకటించింది ఐసీఐసీఐ బ్యాంక్. 2022, అక్టోబర్ 20 నుంచి ఇది అమల్లోకి వచ్చింది.

ఇక ఇదే ప్రాసెసింగ్ ఫీజు క్రెడిట్ కార్డుతో చేసే రెంట్ పేమెంట్స్‌పై తాము కూడా మొత్తం ట్రాన్సాక్షన్ అమౌంట్‌లో నుంచి ఒక శాతం తీసుకుంటామని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గతంలోనే స్పష్టం చేసింది.

97898538

97901854

ఇక కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తుంది. ఇక్కడ రెంట్ పేమెంట్స్‌పై GST తో పాటు.. ఒక శాతం మొత్తాన్ని ప్రాసెసింగ్ ఫీజుగా తీసుకుంటోంది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూడా ఇదే విధంగా ఉంది. SBI Cards మాత్రమే నగదు రూపంలో ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తోంది. ఇది మిగతా వాటన్నింటికంటే ఎక్కువే ఉండొచ్చని తెలుస్తోంది. అయితే ఈ క్రెడిట్ కార్డు రెంట్ పేమెంట్స్ ప్రాసెసింగ్ ఛార్జీలతో పాటు బ్యాంకులు ఇతర ఛార్జీలను కూడా వసూలు చేస్తుంటాయి. SMS ఛార్జీలు, ఏటీఎం కార్డు ఛార్జీలు, పాస్‌బుక్ ఛార్జీలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి.

Read Latest

Business News and Telugu News

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *