Guru Shukra Yuti 2023 మీనంలో గురు శుక్రుల కలయికతో ఈ రాశులకు ఆదాయం అమాంతం పెరిగిపోతుంది…!

Jupiter and Venus Conjunction in Pisces జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీన మీనరాశిలో శుక్రుడు, గురు గ్రహాల కలయిక జరగనుంది. ఈ సమయంలో కొన్ని శుభయోగాలు ఏర్పడనున్నాయి.

Jupiter and Venus Conjunction in Pisces నవ గ్రహాలలో శుక్రుడిని సంపదకు, ప్రేమకు ప్రతీకగా పరిగణిస్తారు. వేద జ్యోతిష్యం ప్రకారం, ఎంతో ప్రాముఖ్యత ఉన్న శుక్రుడు ఫిబ్రవరి 15వ తేదీన అంటే బుధవారం రోజున రాత్రి 8:12 గంటలకు కుంభ రాశి నుంచి మీన రాశిలోకి సంచారం చేయనున్నాడు. అనంతరం మేషరాశిలోకి రవాణా చేయనున్నాడు. మరోవైపు గురుడి సొంత రాశి అయిన మీనంలోనే బృహస్పతి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో శుక్రుడు, గురు గ్రహాల కలయిక జరగనుంది. ఈ కాలంలో కొన్ని శుభయోగాలు ఏర్పడనున్నాయి. ముఖ్యంగా గురువు హన్స్ రాజ యోగాన్ని ఏర్పరచగా.. శుక్రుడు మాళవ్య రాజ యోగాన్ని ఏర్పరచనున్నారు. ఈ రెండు రాజయోగాలు జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత కీలకమైనవి. ఈ సమయంలో ద్వాదశ రాశులకు శుభ ఫలితాలు రానున్నాయి. అయితే కొన్ని రాశుల వారికి మాత్రం ఐశ్వర్యం, ఆదాయం అమాంతం పెరిగే అవకాశం ఉంది. ఇంతకీ ఆ రాశులేవి.. ఆ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడే చూసెయ్యండి…

మిధున రాశి(Gemini)..

ఈ రాశి వారికి గురు, శుక్ర గ్రహాల కలయిక వల్ల శుభ ఫలితాలు రానున్నాయి. ఈ రెండు గ్రహాలు కలిసి ఏర్పరిచే శుభ యోగాల వల్ల ఆర్థిక పరంగా అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. మీరు పదోన్నతి పొందేందుకు బలమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారులు త్వరలో మంచి లాభాలను పొందొచ్చు.

Surya Gochar 2023 కుంభంలో సూర్యుడు, శని గ్రహాల కలయికతో ఏ రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందంటే…!

కర్కాటక రాశి(Cancer)..

ఈ రాశి వారికి శుక్రుడు, గురుడు కలిసి రాజ యోగాల కారణంగా జీవితంలో అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ రాశి నుంచి శుక్రుడు ఉచ్చస్థితిలో ఉంటాడు. ఈ సమయంలో మీరు కొత్త వాహనం లేదా ఏదైనా కొత్త ఆస్తికి సంబంధించిన వాటిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. మీ తండ్రి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వారు వ్యాపారంతో సంబంధం ఉండేవారు మంచి ప్రయోజనాలు పొందొచ్చు.

కన్య రాశి (Virgo)..

ఈ రాశి వారికి రెండు గ్రహాల కలయిక వల్ల శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీరు ఆదాయానికి సంబంధించి కొత్త వనరులను పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారులలో ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం చేస్తుంటారో.. వారు మరిన్ని అద్భుతమైన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో కొనసాగుతున్న సమస్యలకు త్వరలో పరిష్కారం లభించే అవకాశం ఉంది. మీ భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది.

వృశ్చిక రాశి(Scorpio)..

ఈ రాశి వారికి హన్స్, మాళవ్య రాజయోగాల వల్ల ఆర్థిక పరమైన విషయాల్లో తిరుగు అనేదే ఉండదు. అకస్మాత్తుగా సంపద పెరిగిపోతూ ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ అప్పులన్నింటినీ తీర్చేస్తారు. మరోవైపు ఈ కాలంలో మీ వైవాహిక సంబంధంలో సంతోషంగా ఉంటుంది. మీరు మీ భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

గమనిక :

ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. పై సమాచారాన్ని ‘‘సమయం తెలుగు’’ దృవీకరించడం లేదు.

Read

Latest Astrology News

and

Telugu News

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *