Horoscope Today Feb 14th కుంభంలో త్రిగ్రాహి యోగం వల్ల ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే…!

horoscope today 14 February 2023 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, రాశి ఫలాల గురించి తెలుసుకోవడం వల్ల భవిష్యత్తు గురించి ఒక అంచనాకు రావొచ్చు. ఈ నేపథ్యంలో ఈరోజున 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలొచ్చాయంటే…

horoscope today 14 February 2023 మంగళవారం రోజున చంద్రుడు పగలు, రాత్రి వృశ్చిక రాశిలోకి ప్రవేశించనున్నాడు. మరోవైపు కుంభరాశిలో సూర్యుడు, శుక్రుడు, శని గ్రహాల కలయిక వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. దీంతో పాటు అనురాధా నక్షత్ర ప్రభావం రోజంతా ఉంటుంది. మరోవైపు బుధుడు శ్రవణ నక్షత్రంలోకి సంచారం చేయనుండగా.. శని ధనిష్ఠ నక్షత్రంలో నాలుగో దశలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో మిధున రాశి వారికి పురోగతి లభించే అవకాశం ఉంది. మీన రాశి వారికి పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు ఇంట్లో ఎక్కువ సమయం గడపాలని ఆలోచిస్తారు. దీని వల్ల మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు. విద్యార్థులకు పరీక్షా ఫలితాలు కొనసాగుతాయి. కాబట్టి మీ పరీక్షలపై మరింత శ్రద్ధ వహించాలి. ఈరోజు కొన్ని కారణాల వల్ల మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాల్సి రావొచ్చు. ఏదైనా చిన్న సమస్య మీకు ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

ఈరోజు మీకు 66 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం :

ఈరోజు ఉపవాసం ఉండి, హనుమంతుడిని పూజించాలి.

Surya Gochar 2023 కుంభంలో సూర్యుడు, శని గ్రహాల కలయికతో ఏ రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందంటే…!

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు పెట్టుబడికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ లాభాలు పొందొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా కష్టపడి పని చేయాలి. మరోవైపు ఈరోజు మీరు చాలా బిజీగా ఉంటారు. సాయంత్రం నాటికి మీరు కొన్ని శుభవార్తలను పొందొచ్చు. దీని వల్ల మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు చేసే పనులలో అప్రమత్తంగా ఉండాలి. అప్పుడే మీరు నష్టాల బారి నుంచి తప్పించుకోవచ్చు.

ఈరోజు మీకు 78 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం :

ఈరోజు తూర్పు, దక్షిణ దిశల్లో ప్రయాణం చేయాలి.

మిధున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు వ్యాపారులు కొత్త టెక్నాలజీని తమ వ్యాపారంలో ఉపయోగిస్తారు. పని, ఇంటికి సంబంధించిన విషయాల్లో మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. విద్యార్థులు ఈరోజు విద్యపై ఎక్కువ ఫోకస్ పెడతారు. దీని వల్ల మీకు మంచి ప్రయోజనాలు చేకూరతాయి.

ఈరోజు మీకు 62 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం

: సాయంత్రం వేప చెట్టుకు నీరు సమర్పించి, మల్లెపువ్వుల నూనెను వెలిగించాలి.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

ఈ రాశి వారిలో కొందరు వ్యక్తులు తమకు తెలిసిన వ్యక్తుల కారణంగా కొంత సొమ్ము నష్టపోవాల్సి రావొచ్చు. దీని వల్ల మీ మనసులో నిరాశ కలుగుతుంది. ఇలాంటి సమయంలో మీరు ఏమీ చేయలేరు. మీ కుటుంబంలోనే మీకు ప్రత్యర్థులుగా మారి మిమ్మల్ని కొంతకాలం ఇబ్బంది పెట్టొచ్చు. మరోవైపు ఈరోజు మీరు చాలా తెలివిగా పని చేయాలి.

ఈరోజు మీకు 91 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం :

ఈరోజు ఎరుపు రంగు వస్త్రాలను ధరించాలి.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు తమ మనసులో కొత్త ఆలోచనలను కలిగి ఉంటారు. వెంటనే వాటిని అమలు చేయడం వల్ల మీకు లాభదాయకంగా ఉంటుంది. బంధువులు, పాత స్నేహితుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని కారణాల వల్ల కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం పెరగొచ్చు.

ఈరోజు మీకు 81 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం :

ఈరోజు హనుమంతునికి తమలపాకులు, బెల్లం పప్పు సమర్పించాలి.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు ఇంటి పనుల్లో చాలా బిజీగా ఉంటారు. మీరు మనసుతో చేసే పనుల వల్ల అనేక లాభాలను పొందొచ్చు. దీని వల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు. నిజాయితీగా పని చేయడం వల్ల మీకు శుభ ఫలితాలొస్తాయి. ఈరోజు ఏదైనా పెద్ద సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈరోజు మీరు మీ సామర్థ్యం మేరకు ఇతరులకు సహాయం చేయాలి.

ఈరోజు మీకు 86 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం :

ఈరోజు హనుమంతుడికి ఎర్రచందనం తిలకం సమర్పించాలి.

Mahashivratri 2023 మహాశివరాత్రి రోజున ఈ పరిహారాలతో శని, నాగదోషాలతో పాటు ఎన్నో సమస్యల నుంచి విముక్తి పొందొచ్చు…!

తుల రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆరోగ్యం విషయంలోనూ ఎక్కువ శ్రద్ధ వహించాలి. మరోవైపు రొమాన్స్ విషయంలో ఈరోజు బాగా ఆనందిస్తారు. ఈ కారణంగా మీరు సంతోషిస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల వాతావరణం కలిసొస్తుంది.

ఈరోజు మీకు 88 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం

: ఈరోజు ఆంజనేయస్వామికి సింధూరం సమర్పించాలి.

వృశ్చిక రాశి వారి ఫలితాలు (Scorpio Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు చాలా రంగాల్లో లాభాలను పొందే అవకాశం ఉంది. ఈరోజు మీరు చాలా దూరం ప్రయాణించాల్సి రావొచ్చు. కొందరు ప్రభావవంతమైన వ్యక్తులు మిమ్మల్ని ఏదైనా పార్టీలో కలుస్తారు. వారితో కలవడం వల్ల మీకు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే మీరు మరింత కష్టపడి పని చేయాల్సి ఉంటుంది.

ఈరోజు మీకు 79 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం

: ఈరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత సాయంత్రంలోపు 108 సార్లు హనుమాన్ చాలీసా పఠించాలి.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు సమయం అనుకూలంగా ఉండటం వల్ల ప్రతి ఒక్క అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగులు ఆఫీసులో సహోద్యోగులతో వాదనలు పెట్టుకోవద్దు. ఈరోజు మీరు ప్రయాణం చేయడం వల్ల ఒక ముఖ్యమైన పని పూర్తవుతుంది. ఆర్థిక పరమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవం ఉన్న వారి సలహా తీసుకోవడం వల్ల మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

ఈరోజు మీకు 93 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం :

ఈరోజు ఉపవాసం ఉండి, పేదలకు సహాయం చేయాలి.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. వ్యాపారులకు తాము చేసే వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మరోవైపు ఈరోజు మీరు చాలా పనులు చేయాల్సి ఉంటుంది. అయితే పనులకు సంబంధించి ఎవరితోనూ వివాదాలు పెట్టుకోకూడదు. ఈ విషయంలో మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఉద్యోగులకు కార్యాలయంలో స్థానం మెరుగుపడుతుంది.

ఈరోజు మీకు 84 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం

: ఈరోజు రాత్రి ఒక నల్ల కుక్కకు చివరి రొట్టెను తినిపించాలి.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు కొందరు వ్యక్తులతో సంభాషణలు జరపడం వల్ల కొన్ని కొత్త ప్రయోజనాలు పొందొచ్చు. స్నేహితులకు బహుమతులు కొనుగోలు చేసేటప్పుడు, మీ బ్యాలెన్స్ ను గుర్తుంచుకోండి. ఈరోజు మీకు చాలా విషయాల్లో కొంత కష్టంగా ఉంటుంది. మరోవైపు ఉద్యోగులు కార్యాలయంలో సహోద్యోగులతో కలిసి పని చేయడం వల్ల మీకు మంచి ఫలితాలొస్తాయి.

ఈరోజు మీకు 69 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం

: ఈరోజు ఉపవాసం ఉండి, హనుమాన్ చాలీసా పఠించాలి.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు అనేక రంగాల్లో పురోగతి లభించే అవకాశం ఉంది. ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే అవకాశం ఉంది. దీంతో మీ ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. దీని వల్ల మీరు అనేక ప్రయోజనాలు పొందుతారు. ఈరోజు మీరు కష్టపడి పని చేస్తే, కచ్చితంగా దానికి తగిన ఫలితం పొందుతారు.

ఈరోజు మీకు 72 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం

: ఈరోజు రావి చెట్టు ఆకులపై రాముని పేరు రాసి హనుమంతునికి హారం సమర్పించాలి.

గమనిక :

ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

Read

Latest Astrology News

and

Telugu News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *