India vs Australia: భారత్, ఆస్ట్రేలియా మధ్య ఢిల్లీ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభంకానున్న రెండో టెస్టులో మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) ఆడటంపై సందిగ్ధత నెలకొంది. గత కొన్ని రోజుల నుంచి వెన్ను నొప్పితో బాధపడుతున్న ఈ యంగ్ బ్యాటర్.. గత వారం నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టుకి కూడా దూరంగా ఉండిపోయాడు. దాంతో టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కి ఆ టెస్టులో ఫస్ట్ ఛాన్స్ దక్కింది. కానీ.. ఆ మ్యాచ్‌లో సూర్య 8 పరుగులకే సింపుల్‌గా ఔటైపోయాడు.
నాగ్‌పూర్ టెస్టులో విఫలమైనా.. సూర్యకుమార్ యాదవ్‌కి రెండో ఛాన్స్ కూడా దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. దానికి కారణం మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఇంకా ఫిట్‌నెస్ సాధించకపోవడమే. వాస్తవానికి ప్లేయర్ గాయపడిన వెంటనే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)కి వెళ్తుంటారు. అక్కడ ఫిజియో పర్యవేక్షణలో మళ్లీ ఫిట్‌నెస్ సాధించి టీమ్‌లోకి రీఎంట్రీ ఇస్తారు. కానీ శ్రేయాస్ అయ్యర్ ఇక్కడ కేవలం నొప్పితో బాధపడుతుండటంతో భారత్ జట్టుతోనే కలిసి అతను నాగ్‌పూర్ నుంచి ఢిల్లీకి కూడా వెళ్లాడు. కానీ మ్యాచ్‌లో ఆడటం అనుమానమే.
2021లో టెస్టు సెంచరీతో భారత టెస్టు టీమ్‌లో వెలుగులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ ఆ తర్వాత వన్డే, టీ20 జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. కానీ ఈ 28 ఏళ్ల క్రికెటర్ కెరీర్‌ని గాయాలు దెబ్బతీస్తున్నాయి. న్యూజిలాండ్‌తో గత జనవరిలో అతను వన్డే మ్యాచ్ సిరీస్ ఆడాడు. కానీ ఆ వెంటనే మళ్లీ వెన్ను నొప్పి వెంటాడింది.
Read Latest
Sports News
,
Cricket News
,