Javed Khan Amrohi Died: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత!

Actor Javed Khan Amrohi Died: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది, బాలీవుడ్ సినిమాల్లో తనదైన నటనతో ప్రజల మనసులను గెలుచుకున్న నటుడు జావేద్ ఖాన్ అమ్రోహి కన్నుమూశారు. 70 ఏళ్ల జావేద్ ఫిబ్రవరి 14 ఉదయం అనారోగ్య పరిస్థితుల కారణంగా తుది శ్వాస విడిచారు. జావేద్ ‘లగాన్’, ‘వన్స్ అపాన్ ఎ టైమ్’, ‘అందాజ్ అప్నా అప్నా’ సహా ‘చక్ దే ఇండియా’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో భాగమయ్యారు. జావేద్ ఖాన్ 2020లో చివరిసారిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఆయన నటించిన చివరి సినిమా పేరు ‘సడక్ 2’. ఈ ‘సడక్ 2’ సినిమాలో జావేద్ ఖాన్ పాక్యా అనే పాత్ర పోషించాడు. ఆలియా భట్, సంజయ్ దత్ సహా ఆదిత్య రాయ్ కపూర్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఇక సినిమాలు మాత్రమే కాకుండా జావేద్ ఖాన్ అమ్రోహి అనేక టీవీ షోలలో కూడా కనిపించారు.

అంతేకాక జావేద్ IPTA అంటే ఇండియన్ పీపుల్స్ థియేటర్స్ అసోసియేషన్లో ఒక యాక్టివ్ మెంబర్ కూడా. ఇక జావేద్ చాలా కాలంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని, దాని వల్ల గత ఏడాది కాలంగా మంచాన ఉన్నారని తెలుస్తోంది. ఇక అనారోగ్యం వలన శాంతాక్రూజ్‌లోని సూర్య నర్సింగ్‌హోమ్‌లో చేరిన ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు.

ఆయన రెండు ఊపిరితిత్తులు విఫలమయ్యాయని తెలుస్తోంది. ఇక ఆయన అంత్యక్రియలు సాయంత్రం 6.30 గంటలకు ఓషివారా గ్రేవ్ యార్డ్‌లో జరిగాయి. జావేద్ ఖాన్ అమ్రోహి ముంబైలో జన్మించి బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి సపోర్టింగ్ రోల్స్‌తో పాటు అతిధి పాత్రలు కూడా చాలా చేశాడు. దాదాపు 150 హిందీ చిత్రాలలో ఆయన చేసిన విభిన్న పాత్రలు ప్రేక్షకులలో ఆయన ఒక భిన్నమైన నటుడనే ముద్ర వేశారు. 

Also Read: Samantha visits Palani: ప్రముఖ ఆలయానికి సమంత..మెట్టుమెట్టుకూ కర్పూరం వెలిగించి మొక్కు చెల్లింపు!

Also Read: Agni Nakshatram Glimpse: రానా చేతుల మీదుగా అగ్ని నక్షత్రం గ్లింప్స్.. అదరకోట్టేసిందిగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ –  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ –  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *