OMG Scary Viral Video: చుట్టూ వందలకొద్ది మొసళ్లు.. మధ్యలో చిన్న బోటుపై దుస్సాహసం..

OMG Scary Viral Video : ఓ వ్యక్తి చిన్నపాటి నీళ్ల కాలువలో బోటుపై వేగంగా వెళ్లడం ఈ వీడియోలో చూడొచ్చు. బోటుపై వెళ్తే అందులో అంత ప్రమాదం ఏముంది, దుస్సాహసం ఏముంది అని అనుకోకండి. ఒకసారి ఆ వీడియోను సరిగ్గా గమనించండి.. కాలువ నిండా వందల సంఖ్యలో భారీ సైజ్ మొసళ్లు ఉన్నాయి

OMG Scary Viral Video : కొన్ని వీడియోలు చూస్తుంటే వారు చేసేది సాహాసం అనుకోవాలో లేక దుస్సాహసం అనుకోవాలో అర్థం కాదు. ప్రాణాలకు తెగించి చావు అంచుల్లో చేసే సాహసాలు ఏ మాత్రం అటుఇటైనా లైఫ్ గోవిందా అనుకోవాల్సిందే. ఇంకొన్ని సందర్భాల్లోనైతే ఆ దుస్సాహసంలో రెప్పాపాటు కాలంలో ఏ ప్రమాదం జరిగినా కనీసం డెడ్ బాడీ కాదు కదా.. చిన్న మాంసపు ముద్ద కూడా దొరకదు. ఇదిగో ఇప్పుడు మీరు చూడబోయే వీడియో కూడా దాదాపు అలాంటిదే.

ఓ వ్యక్తి చిన్నపాటి నీళ్ల కాలువలో బోటుపై వేగంగా వెళ్లడం ఈ వీడియోలో చూడొచ్చు. బోటుపై వెళ్తే అందులో అంత ప్రమాదం ఏముంది, దుస్సాహసం ఏముంది అని అనుకోకండి. ఒకసారి ఆ వీడియోను సరిగ్గా గమనించండి.. కాలువ నిండా వందల సంఖ్యలో మొసళ్లు ఉన్నాయి. అవి కూడా చిన్న సైజువి కాదు.. ఒక్కో మొసలి ఒక్కో మనిషిని ఈజీగా నోట కర్చుకుని నమిలి మింగి పారేయగలదు. అంత భారీ సైజులో ఉన్నాయి. అంత పెద్ద పెద్ద మొసళ్లు.. అవి కూడా వందల సంఖ్యలో ఉన్న మొసళ్ల మధ్యలోంచి చిన్నబోటుపై ముందుకు సాగిపోతున్నాడు ఈ వీడియో తీసిన వ్యక్తి. 

మొసలికి తన పొడవు కంటే ఎక్కువ దూరం, ఎత్తు ఎగిరే శక్తిసామర్థ్యాలు ఉంటాయి. అందులోనూ నేలపై కంటే నీళ్లలో ఉన్నప్పుడు మొసలికి బలం ఎక్కువ. నేలపై కేవలం పాకగలదు.. కానీ నీళ్లలో మాత్రం కంటికి చిక్కనంత వేగంగా పరిగెత్తగలదు. నీళ్లలో మొసలితో పోరాడటం ఎవరి తరం కాదు. ఎందుకంటే మొసలి నీళ్లలో అడుగున దాక్కుని అదును చూసుకుని తన లక్ష్యంపై ఎటాక్ చేస్తుంది. మొసలి టార్గెట్ చేసిందంటే తప్పించుకోవడం దాదాపు కష్టమే. అలాంటి మొసళ్ల మధ్యలోంచి ఇలా చిన్న బోటుపై వెళ్లడం నిజంగా దుస్సాహసం కాక మరేమవుతుంది. ఒకవేళ ఎత్తైన స్టీమర్లు, లాంచిల్లోనైతే మొసలి నుంచి రక్షణ ఉంటుంది కానీ చిన్న బోటుల్లో ఆ రక్షణ ఉండదు. మొసలి ఎటాక్ చేసిందంటే ఇక అంతే సంగతి మరి !!

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *