ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (Women’s Premier League) -2023 వేలంలో భారత మహిళా క్రికెటర్లకి భారీ ధర దక్కింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన రూ.50 లక్షల కనీస ధరతో సోమవారం వేలంలోకిరాగా.. ముంబయి ఇండియన్స్‌తో పోటీపడి మరీ రూ.3.4 కోట్లకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) దక్కించుకుంది. అలానే రూ. 50 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన రేణుక సింగ్‌ని కూడా ఆర్సీబీ రూ.1.50 కోట్లకి కొనుగోలు చేసింది. భారత్ జట్టులో స్మృతి మంధాన స్టార్ బ్యాటర్‌కాగా.. రేణుక ప్రస్తుతం ప్రధాన బౌలర్‌గా కొనసాగుతోంది.
దక్షిణాఫ్రికాలో ప్రస్తుతం ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ జట్టు ఆడుతోంది. దాంతో ముంబయిలో జరిగిన ఈ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ -2023 వేలాన్ని అక్కడి నుంచే ఒకే రూములో కూర్చుని వీక్షించిన మహిళా క్రికెటర్లు.. స్మృతి మంధాన భారీ ధరకి అమ్ముడుపోగానే కేరింతలతో హోరెత్తించారు. ఆ తర్వాత కాసేపటికే రేణుక సింగ్‌కి కూడా మెరుగైన ధర రావడం.. ఆమెని కూడా ఆర్సీబీ టీమ్ దక్కించుకోవడంతో ‘ఆర్సీబీ.. ఆర్సీబీ’ అంటూ కేకలు వేశారు. అనంతరం రేణుకని స్మృతి హగ్ చేసుకుంటూ కనిపించింది.
జెమీమా రోడ్రిగ్స్ రూ.50 లక్షల కనీస ధరతో వేలంలోకిరాగా.. ఆమెని రూ.2.2 కోట్లకి ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. షెఫాలి వర్మ కనీస ధర కూడా రూ.50 లక్షలుకాగా.. వేలంలో ఈ బ్యాటర్‌ని ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2 కోట్లకి దక్కించుకోవడం విశేషం. కానీ రాజేశ్వరి గైక్వాడ్ రూ.40 లక్షల ధరతో వేలంలోకిరాగా.. ఆమెని అదే ధరకి యూపీ వారియర్స్ కొనుగోలు చేసింది. అయితే.. ఇదే యూపీ వారియర్స్ ఫ్రాంఛైజీ.. దీప్తి శర్మని రూ.2.6 కోట్లకి కొనుగోలు చేయడం విశేషం.
పూజా వస్త్రాకర్‌ని ముంబయి ఇండియన్స్ రూ.1.9 కోట్లకి, రాధ యాదవ్‌ని రూ.40 లక్షలకి ఢిల్లీ క్యాపిటల్స్, వికెట్ కీపర్ యస్తిక భాటియాని రూ.1.5 కోట్లకి ముంబయి ఇండియన్స్ కొనుగోలు చేశాయి. అలానే మరో వికెట్ కీపర్ రిఛా ఘోస్‌ని రూ.1.9 కోట్లకి బెంగళూరు దక్కించుకుంది. భారత ఉమెన్స్ టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ని రూ.1.8 కోట్లకి ముంబయి ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఓవరాల్‌గా భారత క్రికెటర్ల కోసం బెంగళూరు ఫ్రాంఛైజీ వేలంలో భారీగా వెచ్చించింది.
Read Latest
Sports News
,
Cricket News
,