Shreyas Iyer: రెండో టెస్టుకు ముందు భారత్‌కు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం!

Shreyas Iyer Likely to miss India vs Australia 2nd Test in Delhi: బోర్డర్-గవాస్కర్ సిరీస్‌ 2023లో భాగంగా నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొదటి టెస్టులో భారత్ ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకు ఆలౌట్ అవ్వగా.. రోహిత్ సేన తొలి ఇన్నింగ్స్‌లో 400 రన్స్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 91కే ఆలౌట్‌ అవడంతో.. నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక రెండో టెస్ట్ ఢిల్లీ వేదికగా ఫిబ్రవరి 17 నుంచి ఆరంభం కానుంది. ఈ టెస్టుకు ముందు భారత్‌కు భారీ షాక్ తగిలింది. 

వెన్ను గాయం కారణంగా నాగ్‌పూర్‌ టెస్టుకు దూరమయిన మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్‌ అయ్యర్‌.. ఢిల్లీ టెస్టుకు కూడా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో అయ్యర్‌ రిహాబిలేషన్ పొందుతున్నాడు. అయితే పూర్తి ఫిట్‌నెస్‌ ఇంకా సాదించలేదట. అయ్యర్‌ జట్టుతో కలిసి ఢిల్లీకి వెళతాడని, రెండవ టెస్ట్‌కు అతడు అందుబాటులో ఉండే అవకాశం లేదని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. 

మరోవైపు బీసీసీఐ తాజా నిబంధలు ప్రకారం… జట్టులోని ఏ ఆటగాడైనా గాయం నుంచి కోలుకున్నాక తిరిగి జాతీయ జట్టులోకి రావాలంటే ఒక దేశవాళీ మ్యాచ్‌ ఆడాల్సి ఉంటుంది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా తాజాగా రంజీ మ్యాచ్‌లో ఆడి భారత జట్టులోకి వచ్చాడు. ఇదే నిబంధన శ్రేయస్ అయ్యర్‌కు కూడా వర్తించే అవకాశాలు లేకపోలేదు. దాంతో అయ్యర్ నేరుగా రెండో టెస్టు మ్యాచ్‌లో ఆడే అవకాశాలు లేవు. మరి అయ్యర్ విషయంలో బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. 

శ్రేయస్ అయ్యర్‌ స్థానంలో నాగ్‌పూర్‌ టెస్టులో సూర్యకుమార్ యాదవ్‌ ఆడాడు. సూర్య తన అరంగేట్రం టెస్టులో 8 పరుగులకే ఔట్ అయ్యాడు. అయ్యర్‌ రెండో టెస్టులో కూడా ఆడే అవకాశాలు లేకపోవడంతో సూర్యకు నిరూపించుకోవడానికి మరో అవకాశం రానుంది. గత నెలలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అయ్యర్‌ గాయపడ్డాడు. న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. ఇప్పుడు కీలక టెస్ట్ సిరీస్‌కు కూడా దూరమవుతున్నాడు. 

Also Read: Upcoming Cars In India: భారత మార్కెట్‌లోని 3 పురాతన కార్లు.. బుకింగ్ కూడా మొదలైంది! ఎలక్ట్రిక్ వెర్షన్‌లో అంబాసిడర్‌

Also Read: Honda City Cars: 3 లక్షలకే హోండా సిటీ కారు.. గంటలో నంబర్ ప్లేట్‌తో సహా ఇంటికి తీసుకెళ్లిపోవుచ్చు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ –  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ –  https://apple.co/3loQYe 

Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *