
ఈ రోజులలో ప్రేమించి పెళ్ళి చేసుకోవడం కామన్ అయిపోయింది. ఐతే ఆ ప్రేమ వివాహాలు ఎంతవరకు నిలబడుతున్నాయనేది చెప్పడం కష్టం. ఐతే కొంత మంది తమ ప్రేమను సఫలం చేసుకొని తమ జీవితాన్ని ఆదర్శంగా మలుచుకుంటారు.తమ ప్రేమ వైవాహిక జీవితాన్ని విజయపథంలో నడుపుతుంటారు. అలాంటి వారిలో డా. రాజానంద రెడ్డి, డా.రాజ్యలక్ష్మి దంపతుల జంట ఒకటి. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ విజయవంతమైన ప్రేమకథను మీ ముందుంచుతున్నాం.

డా. రాజానంద రెడ్డి, డా.రాజ్యలక్ష్మి.. ఇద్దరూ గుంటూరు మెడికల్ కళాశాలలో తమ వైద్యవిద్యను పూర్తి చేశారు. ప్రేమించుకున్నారు. యం.బి.బి.ఎస్. పూర్తి చేసిన తర్వాత.. హౌజ్ సర్జన్లుగా మరో రెండేళ్లు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరో మూడేళ్ళు పూర్తి చేసుకుని అనంతరం పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు.

పెళ్లి తర్వాత కూడా విద్యలో ఒకరికి ఒకరు సహకరించుకుంటూనే వైద్య వృత్తిలో కొనసాగారు. ఆ సమయంలోనే డా.రాజ్యలక్ష్మి నియోనాటాలజీలో మాస్టర్స్ డిగ్రీని సంపాదించారు. ఆమె భర్త డా.రాజానంద రెడ్డి ప్రతిష్టాత్మక మణిపాల్ యూనివర్సిటీ నుండి జనరల్ మెడిసిన్ లో మాస్టర్స్ డిగ్రీని సంపాదించారు.

తమ స్వస్థలం నరసరావుపేటలో అందరికీ అందుబాటులో తమ వైద్యసేవలు అందించాలనే సదుద్దేశంతో లైఫ్ లైన్ హాస్పిటల్స్ ను ప్రారంభించారు. నేడు పల్నాడు జిల్లా కేంద్రంలోని ప్రముఖ హాస్పిటల్స్ లో లైఫ్ లైన్ హాస్పిటల్స్ ఒకటి.

ఇద్దరు డాక్టర్ల అన్యోన్న దాంపత్యానికి ప్రతీక గా ఓ బాబు తో పాటు ఇద్దరు కవల పిల్లలు జన్మించారు. ఓ వైద్యుడిగా ఎంతో బిజీగా ఉండే భర్తకి చేదోడు వాదోడుగా ఉంటూనే డా.రాజ్యలక్ష్మి అటు ఇంటి పనులతో పాటు ఇటు హాస్పిటల్ బాధ్యతలను కూడా తానే చూసుకుంటుంటారు. డా.రాజ్యలక్ష్మి అప్పుడే పుట్టిన చంటిపాపల పట్ల ప్రత్యేక శ్రద్ధతో వైద్యం అందించడమే గాక తన స్నేహితురాలు డా.శ్రావణి సహాయంతో గైనకాలజీ విభాగంలో కూడి సేవలు అందిస్తున్నారు.

ఈ స్టోరీలో ట్విస్టులు లేకపోవచ్చు.. చేజింగులు ఉండకపోవచ్చు. ఈడు కాని ఈడులో ఇష్టపడి లేచిపోయి పెళ్లిచేసుకునే జంటలు ఎన్నో. లైఫ్ లీడ్ చేసే క్రమంలో కష్టాలు పడుతున్న జంటలు ఎన్నో. విడిపోతున్న జంటలు మరెన్నో. కానీ ఈ జంట ఒకరిపై ఒకరు మనసుపడ్డారు. ఒక్కటయ్యేందుకు పెద్దలను, చదువులను, వ్యక్తిగత జీవితాలను ఇబ్బందిలో పెట్టుకోలేదు. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూనే
కెరీర్ లో సెటిల్ అయి ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లిచేసుకున్నారు.

ప్రేమ వివాహం చేసుకుని అటు అత్తింటి వారిని ఇటు పుట్టింటివారిని సంతోషపెడుతూ మరోప్రక్క కుటుంబ బాధ్యతలు,వృత్తిని సైతం విజయవంతంగా కొనసాగిస్తున్న డాక్టర్ రాజానందరెడ్డి-రాజ్యలక్ష్మి దంపతులు నేటితరం ప్రేమికులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.