Hemanth, Tirumala, News 18
కలియుగ వైకుంఠం తిరుమల పుణ్యక్షేత్రం. స్వామి వారు స్వయంవ్యక్తమై వెలసిన క్షేత్రం కావడంతో నిత్యం వేలాదిమంది భక్తులు తిరుమలకు చేరుకొని స్వామి వారిని దర్శించుకుంటారు. ఇలా వచ్చే భక్తులు ముందు రోజే తిరుమలకు చేరుకొని… రాత్రి తిరుమలలో నిద్ర చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కానీ తిరుమలలో గదులు దక్కడం కష్టతరమి భావించిన కొందరు భక్తులు తిరుమలలో కొందరు దళారులను ఆశ్రయిస్తారు. దొరికిందే మంచి బేరం అంటూ భక్తుల వద్ద కొంత సొత్తు తీసుకుంటూ టీటీడీకి చెల్లించే కాషన్ డిపాజిట్ సైతం కాజేస్తున్న ఘనాలు చోటు చేసుకుంటున్నాయి.
పెళ్లి అయిన రెండు రోజులకే.. నవ వధువు వరుడు మృతి..!
గదులు పొందాలంటే ఆధార్ ప్రకారం అదే పేరు కలిగిన వ్యక్తి పేస్ రికగ్నైజెషన్ విధానం ద్వారా మాత్రమే సాధ్యం అవుతోంది. ప్రముఖులు, రాజ్యాంగ బద్ద హోదాలో ఉన్న వ్యక్తులు ఇచ్చిన సిపార్సు లేఖల ఆధారంగా దర్శనం, గదుల కేటాయింపు సాగిస్తుంది టీటీడీ. అదే సమయంలో కాషన్ డిపాజిట్ రిఫండ్ కోసం ఓటీపీని అందుబాటులోకి తీసుకొచ్చింది టీటీడీ. తద్వారా దళారీలను నియంత్రించవచ్చని భావించింది టీటీడీ. కానీ దళారీలు కాషన్ డిపాజిట్ కోసం ఓటీపీ తమ వద్దే పెట్టుకొని దోచుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషించడం కోసం ప్రయత్నాలు చేస్తుంటారు.
Ganta Srinivasa Rao: గంటా శ్రీనివాసరావు ఆ బాధ్యతలు తీసుకుంటారా ?.. వైసీపీని ఢీ కొడతారా ?
నోట్ల రద్దు మునుపు వరకు కాషన్ డిపాజిట్ తో తిరిగిపొందాలంటే ఫింగర్ బైయోమెట్రిక్ అవసరం అయ్యేది. ఇంకా కరోనా అనంతరం మన దేశంలో డిజిటల్ విప్లవం తీవ్ర స్థాయిలో సాగుతూ వచ్చేది. అదే సమయంలో రూముల దళారుల ఏరివేత ప్రారంభిస్తోంది టీటీడీ. గదుల దళారీలకు చెక్ పెట్టేలా ముఖ గుర్తింపు లేదా బయోమెట్రిక్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని టీటీడీ ప్రయత్నిస్తోంది. గది తీసుకున్నవారే తిరిగి ఖాళీ చేసేలా చర్యలు తీసుకునేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. రూ.50 నుంచి రూ.500 వరకు అద్దె కలిగిన గదికి మరో రూ.500 డిపాజిట్ ను చెల్లించాల్సి ఉంటుంది. ఆపై ధర కలిగిన గదులకు ఎంత అద్దె ఉంటే అంతే మొత్తంలో డిపాజిట్ చేయాలి. గదిని పొందే సమయంలో భక్తుడి సెల్ నంబరుకు టీటీడీ నుంచి ఓటీపీ వస్తుంది.
గది ఖాళీ చేసే సమయంలో ఆ ఓటీపీని తెలియజేస్తే డిపాజిట్ రిఫండ్ అవుతుంది. ఖాళీ చేసే సమయంలో భక్తుల సెల్ ఫోన్ కి వచ్చిన ఓటీపీని తెలుసుకుని దళారులు ఆ డిపాజిట్ సొమ్మును తమ జేబుల్లో వేసుకుంటున్నారు. ఇంకొందరు భక్తులు ఓటీపీ తెలియజేయకుండా వెళ్లిపోయి డిపాజిట్ రాలేదంటూ వాపోతున్నారు. వీటన్నిటికి చెక్ పెట్టేలా ఫేస్ రికగ్నిషన్ వ్యవస్థను అమలు చేయాలని టీటీడీ భావిస్తోంది. ప్రయోగాత్మకంగా వారం పాటు పరిశీలించాలని నిర్ణయించింది.