ఆర్‌సీబీ ఉమెన్స్ టీమ్ మెంటార్‌గా సానియా మీర్జా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ మెంటార్‌గా సానియా మీర్జా ఎంపికయ్యారు. ఈ మేరకు ఆర్‌సీబీ ఓ వీడియోను షేర్ చేసింది. ఆర్‌సీబీ మహిళల క్రికెట్ జట్టుకు తాను మెంటార్‌గా ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందని సానియా మీర్జా తెలిపింది. కాగా ఇటీవల వేలంలో టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధానను ఆర్‌సీబీ 3.4 కోట్లు ధరను పలికి దక్కించుకుంది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మార్చి 4నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీ 23రోజుల పాటు సాగనుంది. మొదటి మ్యాచ్ డివై పాటిల్ స్టేడియంలో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరగనుంది. ఫైనల్ మ్యాచ్ మార్చి 26న జరుగుతుంది. అన్ని సాయంత్రం మ్యాచ్‌లు 7:30 నిమిషాలకు ప్రారంభమవుతాయి. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం, బ్రబౌర్న్ స్టేడియంలో మొత్తం మ్యాచ్‌లు జరగనున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్, యూపీ వారియర్స్ జట్లు ఈటోర్నీలో తలపడనున్నాయి.
©️ VIL Media Pvt Ltd.