SBI: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇది 5 బేసిస్ పాయింట్ల నుంచి 25 బేసిస్ పాయింట్ల వరకు ఉంది. రూ.2 కోట్లకు లోబడిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఈ పెంచిన వడ్డీ రేట్లు అమల్లోకి వస్తాయి. ఇంకా ఇవి డిపాజిట్ కాలపరిమితిని బట్టి మారుతుంటాయి. పెంచిన వడ్డీ రేట్లు ఇవాళ్టి నుంచి అంటే ఫిబ్రవరి 15 నుంచే అమల్లోకి వస్తున్నట్లు ప్రకటించింది. ఇదే సమయంలో మరో గుడ్‌న్యూస్ కూడా చెప్పింది. అదే కొత్త ఎఫ్‌డీ స్కీమ్. 400 రోజుల టెన్యూర్‌తో కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించిన SBI.. దీనిపై 7.10 శాతం వడ్డీ రేటు అందిస్తున్నట్లు స్పష్టం చేసింది. ముఖ్యంగా సీనియర్ సిటిజెన్లు అందరికంటే ఎక్కువ ప్రయోజనం పొందనున్నారు.
చివరిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎఫ్‌డీ రేట్లను 2022, డిసెంబర్ 13న పెంచింది. అప్పుడు వివిధ కాలపరిమితిని బట్టి గరిష్టంగా 65 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. అయితే.. ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంక్ మరోసారి రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచగా.. బ్యాంకులు ఇతర లోన్లపై వడ్డీ రేట్లను పెంచడంతో పాటు.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపైనా వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. దీంతో.. బ్యాంకుల్లో డబ్బులు దాచుకునేవారికి ఎక్కువ లబ్ధి చేకూరనుంది.
97933302
97915095
పెంచిన వడ్డీ రేట్ల ప్రకారం.. ఇక ఇప్పటినుంచి SBI లో సంవత్సరం నుంచి రెండేళ్ల వ్యవధి ఉన్న FDలపై గతంలో 6.75 శాతం వడ్డీ రేటు ఉండగా.. ఇప్పుడు అది 6.80 శాతానికి పెరిగింది. ఇది సాధారణ కస్టమర్లకు కాగా.. సీనియర్ సిటిజెన్లకు ఇంతకంటే ఎక్కువే అందనుంది. వారికి అత్యధికంగా 7.30 శాతం వడ్డీ అందుతుండటం విశేషం. ఇక కొత్తగా ప్రకటించిన 400 రోజుల వ్యవధి ఉండే SBI FD Scheme ను ఈరోజే ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. ఈ స్కీమ్‌లో చేరాలనుకునేవారికి 2023, మార్చి 31 వరకు గడువు ఉందని స్పష్టం చేసింది. ఇక దీనిపై గరిష్టంగా 7.10 శాతం వడ్డీ అందుతుంది.
ఇక ఇదే ఎస్‌బీఐ మరో చేదువార్తలు కూడా చెప్పింది. ఆయా లోన్లపై వడ్డీ రేటు పెరుగుతున్నట్లు తెలిపింది. తాజాగా రుణ ఆధారిత వడ్డీ రేటును (MCLR) 10 బేసిస్ పాయింట్ల మేర పెంచేసింది. దీంతో.. MCLR రేటుతో అనుసంధానం అయి ఉన్న.. లోన్లపై వడ్డీ రేటు పెరగనుంది. ఇక క్రితం రోజు.. మరో బ్యాడ్‌న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. SBI క్రెడిట్ కార్డును ఉపయోగించి.. రెంట్ పేమెంట్స్ చేసే వారికి ప్రాసెసింగ్ ఫీజును రూ.99 నుంచి ఏకంగా 100 శాతానికిపైగా పెంచి రూ.199కి చేర్చింది. దీనికి జీఎస్‌టీ ఇంకా అదనం. దీంతో.. ఎఫ్‌డీలపై రెండు శుభవార్తలు.. లోన్లపై చేదువార్త, క్రెడిట్ కార్డు వాడేవారికి చేదువార్త చెప్పింది దిగ్గజ బ్యాంకు.
97914124
97938411
97936660
Read Latest
Business News and Telugu News