ఏపీకి పెట్టుబడుల వరద కొనసాగుతోంది: ఆళ్ల అయోధ్య రామిరెడ్డి

Guntur: ఎంఎస్ఎంఈ రంగంలో మూడేళ్లలో 5,61,235 ఉద్యోగాల కల్పించామని.. రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వివరించారు. ‘ఎంఎస్ఎంఈ రీస్టార్ట్’, ‘వైఎస్సార్ జగనన్న బడుగు వికాసం’, ‘డా.వైఎస్సార్ నవోదయం’ వంటి పథకాల ద్వారా.. ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తోందని వివరించారు. దూరదృష్టితో ఆలోచించే సీఎం జగన్ నాయకత్వంలో.. రాష్ట్రం అభివృద్ధి పథంలో పురోగమిస్తోందని ఎంపీ Ayodhya Rami Reddy వ్యాఖ్యనించారు.

పరిశ్రమల రాకతో స్థానికంగా ఉద్యోగ కల్పన గణనీయంగా పెరిగిందని అయోధ్య రామిరెడ్డి వివరించారు. మూడేళ్ల కిందట 37వేల 956 ఉన్న ఎంఎస్‌ఎంఈ యూనిట్లు.. ఇప్పుడు 60వేల 800 యూనిట్లకు చేరాయని చెప్పారు. ఫలితంగా 5 లక్షల 61 వేల 235 మందికి ఉపాధి లభించిందని వివరించారు. ఎంఎస్ఎంఈల వృద్ధిని ప్రోత్సహించడానికి.. వారి ఖాతాలకు ‘వన్ టైమ్ రీస్ట్రక్చరింగ్’ను ప్రభుత్వం అందిస్తోందని ఎంపీ అయోధ్య రామిరెడ్డి వివరించారు.

97950771

అట్టడుగు వర్గాల వ్యాపారాలను ప్రోత్సహించాలనే యోచనతో “వైఎస్సార్ జగనన్న బడుగు వికాసం” పథకాన్ని ప్రభుత్వం తెచ్చిందని ఎంపీ అయోధ్య రామిరెడ్డి వివరించారు. దీని ద్వారా 5 వేల 725 మంది ఎస్సీ పారిశ్రామికవేత్తలుగా ఎదిగారని చెప్పారు. వారు నిర్వహిస్తున్న ఎంఎస్ఎంఈ యూనిట్లకు రూ.347 కోట్లు.. 1138 ఎస్టీ పారిశ్రామికవేత్తల ఎంఎస్ఎంఈల యూనిట్లకు రూ. 66 కోట్లు ప్రభుత్వ విడుదల చేసిందని వివరించారు. మహిళా పారిశ్రామికవేత్తల ద్వారా సూక్ష్మ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాలను అమలు చేస్తున్నట్టు వివరించారు.

వైఎస్సార్ ఆసరా ద్వారా 33.5 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2568 కోట్లు, వైఎస్సార్ చేయూత కింద 17.89 లక్షల మందికి రూ.3356 కోట్ల సాయం అందించినట్లు ఎంపీ అయోధ్య రామిరెడ్డి వెల్లడించారు. SIPB 2022 జూలైలో రూ.1.26 లక్షల కోట్లు, 2022 డిసెంబర్‌లో రూ. 23,985 కోట్లు, 2023 లో రూ.1.44 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. మొత్తంగా రూ. 2.93 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఏపీకి తెచ్చినట్లు ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వివరించారు.

Read Latest

Andhra Pradesh News

and

Telugu News

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *