ఓ వ్యక్తి ‘పిచ్చి’ పని.. ఇద్దరిని ఆసుపత్రి పాల్జేసింది !

Hyderabad: ఓ వ్యక్తికి శానిటైజర్ (sanitizer) మండుతుందా ? లేదా ? అనే పెద్ద డౌటానుమానం వచ్చింది. తన అనుమాన్ని నివృత్తి చేసుకోవాలననుకున్నాడు. ఓ సారి పరీక్షిస్తే పోలే.. అని శానిటైజర్‌లో అగ్గిపుల్ల గీసి వేశాడు. అంతే.. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అతగాడు చేసిన ‘పిచ్చి’ పని వల్ల ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ బంజారాహిల్స్ (Banjarahills) రోడ్ నెంబర్ 4లో ఓ యానిమల్ కేర్ సెంటర్‌లో జే. మెుగులప్ప నాలుగేళ్లుగా పని చేస్తు్న్నాడు. ఇతని స్వస్థలం వికారాబాద్ (Vikarabad). అదే కేర్ సెంటర్‌లో పవన్ అనే వ్యక్తి ఆఫీస్ బాయ్‌గా పని విధులు నిర్వహిస్తున్నాడు. ఈనెల 12న ఇద్దరూ కలిసి ఐదు లీటర్ల డబ్బాలోని శానిటైజర్‌ను మరో డబ్బాలోకి నింపే ప్రయత్నం చేశారు.

ఈక్రమంలో పవన్‌కు ఓ సందేహం కలిగింది. అసలు శానిటైజర్‌కు నిప్పు అంటుకుంటుందా ? అది మండుతుందా ? అనే అనుమానం వచ్చింది. ఇదే విషయాన్ని మెుగులప్పను అడగ్గా.. తానేప్పుడూ పరీక్షించలేదని ఆయన సమాధానిమిచ్చాడు. అయితే ఓసారి చెక్ చేద్దాం అంటూ పవన్ తన ఉన్న అగ్గిపెట్ట తీసి అగ్గిపుల్లను శానిటైజర్ డబ్బాలో వేశాడు. అంతే ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చేలరేగాయి. ఘటనలో పవన్, మెుగులప్పలకు తీవ్రంగా గాయాలయ్యాయి. అక్కడే ఉన్న మిగతా సిబ్బంది వారని ఆసుపత్రికి తరలించారు. వారిలో మెుగులప్ప పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వైద్యులు అతడికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టా్రు.

ఏది ఏమైనా పవన్ చేసిన ‘పిచ్చి’ పని వల్ల మెుగులప్ప చావుబ్రతుకుల మధ్య కొట్టమిట్టాడుతున్నాడు. తెలిసీ తెలియక ఇలాంటి ‘పిచ్చి’ పనులు చేసి ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Read More Telangana News And Telugu News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *