Bank News | దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌గా కొనసాగుతూ వస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు షాకిచ్చింది. కీలక నిర్ణయం తీసుకుంది. రుణ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీని వల్ల బ్యాంక్ కస్టమర్లపై ప్రతికూల ప్రభావం పడనుంది. బ్యాంక్ నుంచి లోన్ (Loan) తీసుకున్న వారిపై ఎఫెక్ట్ ఉంటుంది. నెలవారీ ఈఎంఐ పైపైకి కదలనుంది. ఇక కొత్తగా లోన్ తీసుకోవాలని భావించే వారికి కూడా ఝలక్ తగలనుంది. రుణ రేట్లు పెరగడం వల్ల అధిక వడ్డీ భారం పడుతుంది.
ఎస్‌బీఐ తాజాగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను పెంచేసింది. ఎంసీఎల్ఆర్ రేటు 10 బేసిస్ పాయింట్ల మేర పైకి కదిలింది. దీని వల్ల వెహికల్ లోన్, హోమ్ లోన్స్ వంటివి భారం కానున్నాయి. రుణ రేట్ల పెంపు నిర్ణయం ఫిబ్రవరి 15 నుంచి అమలులోకి వస్తుంది.
పెట్రోల్,డీజిల్ అక్కర్లేదు.. ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేస్తే 2,000 కి.మి వెళ్లొచ్చు..ఈ కారులో మైండ్‌బ్లోయింగ్ ఫీచర్లు!
ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్లు పెరిగింది. 7.85 శాతం నుంచి 7.95 శాతానికి చేరింది. నెల రోజుల ఎంసీఎల్ఆర్ రేటు అయితే పది బేసిస్ పాయింట్లు పెరిగింది. 8 శాతం నుంచి 8.1 శాతానికి చేరింది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ రేటు విషయానికి వస్తే.. ఇది కూడా 8 శాతం నుంచి 8.1 శాతానికి ఎగసింది. అలాగే ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేటు 8.3 శాతం నుంచి 8.4 శాతానికి పెరిగింది.
రూ.25 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్ .. చౌక ధరకే లభిస్తున్న టాప్ 7 ఇ-స్కూటర్లు ఇవే!
ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు గతంలో 8.4 శాతంగా ఉండేది. ఇప్పుడు ఇది 8.5 శాతానికి చేరింది. రెండేళ్ల ఎంసీఎల్ఆర్ రేటు 8.5 శాతం నుంచి 8.6 శాతానికి ఎగసింది. మూడేళ్ల ఎంసీఎల్ఆర్ రేటు గతంలో 8.6 శాతంగా ఉండేది. ఇప్పుడు ఈ రేటు 8.7 శాతానికి చేరింది. బ్యాంక్ రుణ రేటు పెంపు నేపథ్యంలో రుణ గ్రహీతలపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు.
కాగా దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఇటీవల కీలక రెపో రేటును పెంచిన విషయం తెలిసిందే. పావు శాతం మేర రెపో రేటు పైకి కదిలింది. దీంతో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ స్కూటర్ .. చౌక ధరకే లభిస్తున్న టాప్ 7 ఇ-స్కూటర్లు ఇవే!
ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు గతంలో 8.4 శాతంగా ఉండేది. ఇప్పుడు ఇది 8.5 శాతానికి చేరింది. రెండేళ్ల ఎంసీఎల్ఆర్ రేటు 8.5 శాతం నుంచి 8.6 శాతానికి ఎగసింది. మూడేళ్ల ఎంసీఎల్ఆర్ రేటు గతంలో 8.6 శాతంగా ఉండేది. ఇప్పుడు ఈ రేటు 8.7 శాతానికి చేరింది. బ్యాంక్ రుణ రేటు పెంపు నేపథ్యంలో రుణ గ్రహీతలపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు.
కాగా దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఇటీవల కీలక రెపో రేటును పెంచిన విషయం తెలిసిందే. పావు శాతం మేర రెపో రేటు పైకి కదిలింది. దీంతో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. ఈ క్రమంలోనే ఎస్‌బీఐ ఇప్పుడు రుణ రేట్లు పెంచిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటివి రుణ రేట్లను పెంచేశాయి. రానున్న కాలంలో మరిన్ని బ్యాంకులు రుణ రేట్లను పెంచొచ్చనే అంచనాలు ఉన్నాయి.