(Santhosh,News18,Warangal)
మహబూబాబాద్ (Mahabubabad)జిల్లా డోర్నకల్ శివారు మున్నేరు వాగు సమీపంలో గత శుక్రవారం Fridayకుళ్ళిన స్థితిలో లభ్యమైన గుర్తుతెలియని మృతదేహనికి సంబంధించిన విషయం మిస్టరీగా మారిన సంగతి తెలిసిందే. అయితే, ఆ మృతదేహానికి సంబంధించిన కేసు మిస్టరీ వీడింది. సొంత మరదలే బావను హతమార్చింది. మహబూబాబాద్ డోర్నకల్ (Dornakal)పట్టణ శివారు సిగ్నల్ తండాకు చెందిన బానోత్ జగన్(Banoth Jagan)ఈనెల రెండో తేదీ నుంచి కనిపించడం లేదు. అవివాహతుడైన జగన్ హైదరాబాద్(Hyderabad)లో క్యాటరింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా.. ఈనెల 1వ తేదీన తండాకు వచ్చాడు.
పేదలకు ఫ్రీ ట్రీట్‌మెంట్..నిరుపేదలైతే ఆర్ధికసాయం కూడా..ఆ డాక్టర్ రూటే సెపరేటు..
మరిదిని మట్టుబెట్టిన వదిన..
జగన్ సోదరుడు గోపి ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా.. అతడి భార్య తన ఇద్దరు పిల్లలను వేరే ప్రాంతాల్లోని పాఠశాలలో చదివిస్తూ ఒంటరిగా తండాలోనే ఉంటుంది. అయితే, మరదలి ప్రవర్తన సక్రమంగా లేకపోవడంతో జగన్ తరచూ మందలించేవాడు. కాగా, 1వ తేదీ తండాకి వచ్చిన జగన్ రెండో తేదీ రాత్రి నుంచి కనిపించలేదు. జగన్ మిస్సింగ్ పై తండావాసులు తన మరదలిపై అనుమానంతో గట్టిగా నిలదీశారు. దీంతో జరిగిన విషయాన్ని తండావాసులకు వివరించింది. తన ప్రవర్తనపై బావ జగన్ తరచూ ప్రశ్నించేవాడని, తన కోరిక తీర్చాలని ఒత్తిడి తెచ్చేవాడని తెలిపింది.
చుట్టం చూపుగా వచ్చి చచ్చాడు..
ఈ క్రమంలోనే తనను ఇబ్బందులకు గురిచేస్తున్న జగన్ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకొని తన స్నేహితుడైన మరో వ్యక్తితో పాటు ఇంకో వ్యక్తి సహాయం తీసుకుని బావను హతమార్చింది. కోరిక తీరుస్తానంటూ రెండో తేదీ రాత్రి మున్నేరు శివారు శివాలయం సమీపానికి తీసుకెళ్లాలని మరదలు బావను కోరింది. అక్కడకి వెళ్లిన తర్వాత అప్పటికే తన సమాచారం మేరకు అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులతో కలిసి బండరాళ్లతో తల, మెడపై కొట్టి చంపినట్లు ఒప్పుకుంది. దీంతో ఉద్రేకులైన తండావాసులు సదర మహిళకు దేహశుద్ధి చేశారు. మెడలో చెప్పుల దండ వేసి తండాలో ఊరేగించారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.