గూగుల్ క్రోమ్ కొత్త వెర్షన్‌ని డౌన్‌లోడ్ చేసుకోకపోతే ఇక అంతే సంగతులు గూగుల్ క్రోమ్‌కు ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల వినియోగదారులు ఉన్నారు. ఫోన్ అయినా, కంప్యూటర్ అయినా ఎక్కువమంది గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌పైనే ఆధారపడుతుంటారు. అందుకే ఎప్పటికప్పుడు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తూ ఉంటుంది. అయినా కొంతమంది హ్యాకర్లు వినియోగదారుల డేటాని హ్యాక్ చేస్తుంటారు. అందుకే గూగుల్ క్రోమ్ యూజర్లకు గూగుల్ వార్నింగ్ ఇచ్చింది. ఎందుకంటే…
గూగుల్ ఎంత సెక్యూర్‌గా ఉన్నా బ్రౌజర్‌లో వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్లు ఈజీగా హ్యాక్ చేస్తుంటారు. ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకుంటే వినియోగదారుల బ్యాంకింగ్, వ్యక్తిగత సమాచారమంతా లీక్ అయ్యే ప్రమాదం ఉందని గూగుల్ హెచ్చరించింది. విండోస్ యూజర్లు 109.0.5414.119/120 వెర్షన్, మ్యాక్, లైనక్స్ యూజర్లు 109.0.5414.119 వెర్షన్ కంటే పాత వెర్షన్లు ఇంకా వాడుతుంటే గూగుల్ తీసుకొస్తున్న కొత్త వెర్షన్‌ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. లేదంటే సమాచారాన్ని హ్యాకర్లు దొంగలించే అవకాశం ఉందని హెచ్చరించింది.
©️ VIL Media Pvt Ltd.