Honda Activa | స్కూటర్ కొనుగోలు చేయాలని భావించే వారికి ముందుగా గుర్తుకు వచ్చే పేరు హోండా. ఎందుకంటే హోండా స్కూటర్లు చాలా పాపులర్. కంపెనీ తయారు చేసే స్కూటర్ మోడళ్లు అన్నింటిలోకెల్లా యాక్టివాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. దేశంలోని బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ (Scooter) ఇదే. దీన్ని కొట్టే స్కూటర్ మరొకటి లేదు. అందుకే స్కూటర్ మార్కెట్‌లో హోండా కంపెనీదే అగ్ర స్థానం. అయితే హోండా యాక్టివా (Activa) మినహా కంపెనీ నుంచి మార్కెట్‌లోకి వచ్చిన ఇతర స్కూటర్ మోడళ్లు పెద్దగా కస్టమర్లను ఆకట్టుకోలేపోయాయి.
అందుకే హోండా కంపెనీ స్టైలిష్ స్కూటర్‌ను మార్కెట్‌లోకి దింపాలని భావిస్తోంది. ఇప్పటికే హోండా కంపెనీ ఆసియా లోని ఇతర దేశాల్లో ఈ స్టైలిష్ స్కూటర్‌ను విక్రయిస్తోంది. భారత్‌లో కూడా దీన్ని లాంచ్ చేయడానికి రెడీ అవుతోంది. కంపెనీ గతంలోనే ఈ కొత్త స్కూటర్ లాంచ్‌కు సంబంధించి అన్ని అనుమతులు తీసుకుంది. పేటెంట్ పొందింది. రానున్న కాలంలో ఈ కొత్త స్టైలిష్ స్కూటర్ మన మార్కెట్‌లోకి కూడా ఎంట్రీ ఇవ్వొచ్చు.
శుభవార్త.. కొత్త స్కీమ్ తీసుకువచ్చిన ఎస్‌బీఐ .. చేరితే అదిరే బెనిఫిట్!
ఇంతకీ దీని పేరు ఏంటని అనుకుంటున్నారా? అదే హోండా స్కూపీ. నియో రెట్రో స్కూటర్ ఇది. ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో అదరగొడుతోంది. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో కంపెనీ ఈ స్కూటర్‌ను తయారు చేసింది. కొత్త కొత్త పీచర్లతో ఎప్పటికప్పుడు దీన్ని అప్‌డేట్ చేస్తూ వస్తోంది. కంపెనీ ఇండోనేషియాలో ఈ మోడల్‌కు ఇటీవల మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. అక్కడ ఇది స్పోర్టీ, ఫ్యాషన్, ప్రెస్టీజ్, స్టైలిష్ అనే నాలుగు వేరియంట్ల రూపంలో అందుబాటులో ఉంది.
రూ.25 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్ .. చౌక ధరకే లభిస్తున్న టాప్ 7 ఇ-స్కూటర్లు ఇవే!
అదిరిపోయే డిజైన్ దీని సొంతం. స్కూటర్ ముందు భాగంలో పెద్ద ప్రొజెక్టర్ యూనిట్ ఉంటుంది. ఇండికేటర్ లైట్స్ డిజైన్ కూడా బాగుంది. ఇక ఓఆర్‌వీఎంలు గుండ్రంగా ఉన్నాయి. స్పీడో మీటర్ కూడా రౌండ్ గానే ఉంది. ఈ స్కూటర్ 8 కలర్ ఆప్షన్లలో కస్టమర్లకు అందుబాటులో ఉంది. ముందు భాగంలో టెలీస్కోపిక్ ఫోర్క్స్, రియర్ సింగిల్ షాక్ అబ్జార్బర్, సింగిల్ సైడెడ్ స్వింగ్రామ్, 12 నుంచి 14 ఇంచుల వీల్స్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, రియర్ డ్రమ్ బ్రేక్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఇంకా ఇందులో స్మార్ట్ కీ ఫీచర్ కూడా ఉంది. హోండా యాక్టివా లేటెస్ట్ మోడల్‌లో ఉన్న ఫీచర్ ఇది. ఈ స్కూపీ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 4.5 లీటర్లు. దీని బరువు 95 కేజీలు. ఇందులో 110 సీసీ ఇంజిన్ ఉంటుంది. హోండా కంపెనీ గ్రాజియా స్థానంలో ఈ కొత్త స్కూటర్‌ను మార్కెట్‌లోకి తీసుకు రావొచ్చనే అంచనాలు ఉన్నాయి.