ప్రస్తుతం ట్రెండ్ అంతా ఎలక్ట్రిక్ వాహనాల చుట్టూనే తిరుగుతోంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ భారాన్ని తట్టుకోలేక ఇటీవల కాలంలో చాలామంది ఎలక్ట్రిక్ వాహనాల వైపే మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎలక్ట్రిక్ బస్సులు, కార్లు, ఆటోలు, బైక్‌లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. దీనికి తోడు ఈ- సైకిళ్ల వైపు కూడా ప్రజలు మొగ్గుచూపిస్తున్నారు. ఈ కోవనేలో నెల్లూరు నగరానికి చెందిన సుధాకర్ మాధవ్ అనే సైకిల్ షాపు యజమాని సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా బ్యాటరీతో నడిచే సైకిల్‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
సాధారణంగా ప్రముఖ కంపెనీలు తయారుచేసే ఎలక్ట్రిక్ సైకిళ్ల ధర 35 వేల నుంచి 40వేల రూపాయల వరకు ఉంటోంది. అయితే ఇన్‌స్టాలేషన్‌తో కలిసి తాము కేవలం 25 వేలకే ఎలక్ట్రిక్ సైకిళ్లు అందిస్తున్నామని మాధవ్ చెబుతున్నారు. ఈ సైకిల్‌ని 5 గంటలు ఛార్జ్ చేస్తే 50 నుంచి 60 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. అయితే దీని స్పీడ్ 25 కిలోమీటర్లు మాత్రమే ఉండటం గమనార్హం. ఈ ఎలక్ట్రిక్ సైకిళ్లకు డిమాండ్ విపరీతంగా ఉంటోందని.. ఆర్డర్ చేసినా వారికి సమయానికి సప్లై చేయలేకపోతున్నామని మాధవ్ చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ ఎలక్ట్రిక్ సైకిళ్లు మాత్రం నెల్లూరు వాసులకు సరికొత్త అనుభూతిని ఇస్తున్నాయి.
Read Latest
Andhra Pradesh News
and