పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ ప్రెస్ హైదరాబాద్ : ఘట్ కేసర్ ఎన్ఎఫ్ సీ నగర్ వద్ద గోదావరి ఎక్స్ ప్రెస్ ట్రైన్ పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భువనగిరి, బీబీనగర్, ఘట్ కేసర్ రైల్వేస్టేషన్లలో పలు రైళ్లను అధికారులు ముందస్తుగా నిలిపివేశారు. ఇవాళ ఉదయం 5 గంటల 30 నిమిషాల నుంచి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు.. పట్టాలు తప్పిన ఎస్ 5 బోగీలను వదిలి గోదావరి ఎక్స్ ప్రెస్ సికింద్రాబాద్ బయల్దేరింది. దాదాపు 500 మీటర్ల వరకూ రైల్వేట్రాక్ డ్యామేజీ అయినట్లు తెలుస్తోంది.
©️ VIL Media Pvt Ltd.